థ్రెడ్స్ పై కన్నేసిన టాలీవుడ్ యాక్టర్లు
సినిమా యాక్టర్లకి ఉండే క్రేజ్ అంతా ఇంతా కాదు. ఒక్కసారైనా తమ ఫేవరెట్ హీరోని చూడాలి, కలవాలి అనుకునే అభిమానులు లక్షల్లో ఉంటారు. ఒకప్పుడు వాళ్లను చూడాలంటే కేవలం వారి సినిమా రిలీజైనప్పుడు మాత్రమే చూడగలిగేవారు. కానీ ఇప్పుడు సోషల్ మీడియా పుణ్యమా అని వారితో డైరెక్ట్ గా మాట్లాడగలుగుతున్నారు.
సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక సెలబ్రిటీలు కూడా వాళ్ల ఫ్యాన్స్ కు ఎప్పుడూ టచ్ లోనే ఉంటున్నారు. ట్విట్టర్, ఇన్స్టా, ఫేస్ బుక్ ఇలా అన్ని ప్లాట్ఫామ్స్ లో యాక్టివ్ గా ఉంటూ ఫ్యాన్స్ తో తమ ఫోటోలను షేర్ చేస్తూ ఉంటారు. అయితే ఇప్పుడు టాలీవుడ్ యాక్టర్లంతా ఓ కొత్త సోషల్ మీడియాపై దృష్టి పెట్టారు. అదే థ్రెడ్స్.
ఈ థ్రెడ్స్ అనే సోషల్ మీడియాలో టాలీవుడ్ హీరోలు ఎన్టీఆర్, అల్లుఅర్జున్, రామ్, విజయ్ దేవరకొండ అకౌంట్స్ ఓపెన్ చేశారు. వారిలో థ్రెడ్స్ లో అకౌంట్ ఓపెన్ చేయగానే వారి ఫ్యాన్స్ కూడా వెంటనే అకౌంట్స్ ఓపెన్ చేసుకుని వారిని ఫాలో అవడం మొదలుపెట్టారు. ట్విట్టర్ కు పోటీగా ఇన్స్టాగ్రమ్ ప్రవేశపెట్టిన థ్రెడ్స్ కు యూజర్లు బాగానే వస్తున్నారు.













