‘ఇందువదన’ చిత్రంలో కొత్త లుక్ తో రి – ఎంట్రీ అయిన హీరో వరుణ్ సందేశ్

హ్యాపీడేస్, కొత్త బంగారు లోకం సినిమాలతో ఓవర్ నైట్ క్రేజ్ సంపాదించుకున్న యంగ్ హీరో వరుణ్ సందేశ్. అయితే ఆ తర్వాత వరుణ్ సందేశ్ చేసిన సినిమాలేవీ ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయాయి. దీంతో సినిమాలకు కొంతకాలం బ్రేక్ ఇచ్చిన వరుణ్ సందేశ్ బిగ్‌బాస్ షోతో ద్వారా మరోసారి తెలుగు ఆడియోన్స్‌కు దగ్గరయ్యాడు. సీజన్-3లో మిస్టర్ కూల్ అనే ట్యాగ్ లైన్‌ను సంపాదించుకున్నాడు. ఓ దశలో బిగ్ బాస్ విన్నర్ వరుణ్ సందేశే అనుకున్నారంతా. అయితే ఆ తర్వాత జరిగిన కొన్ని పరిణామాలతో టాప్4 స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. బిగ్‌బాస్ సీజన్-3 ద్వారా ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్న వరుణ్ తాజాగా ఓ సినిమా అనౌన్స్ చేసి మరోసారి రీ ఎంట్రీకి సిద్ధమయ్యాడు. ఎంఎస్‌ఆర్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను శ్రీ బాలాజీ పిక్చర్స్ పతాకం నిర్మిస్తుంది. వరుణ్ సందేశ్ సరసన ఫర్నాజ్ శెట్టి హీరోయిన్‌గా నటిస్తుంది. ఇందువదన అనే ఇంట్రెస్టింగ్ టైటిల్‌తో వస్తోన్న వరుణ్ సందేశ్ సోమవారం ఈ మూవీ ఫస్ట్ లుక్‌ను రిలీజ్ చేశారు.
చాలా గ్యాప్ తర్వాత సినిమా చేస్తుండటం, పోస్టర్ బోల్డ్‌గా ఉండటంతో ఈ మూవీ కథ ఏ విధంగా ఉంటుందోనన్న ఆసక్తి మొదలైంది. పోస్టర్ వేరె లెవల్‌లో ఉందంటూ వరుణ్ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. శ్రీ బాలాజీ పిక్చర్స్ బ్యానర్‌పై నైనిష్య & సాత్విక్ సమర్పణలో MSR దర్శకత్వం వహిస్తున్న, శ్రీమతి మాధవి ఆదుర్తి నిర్మిస్తున్న చిత్రం ‘ఇందువదన’. వరుణ్ సందేశ్, ఫర్నాజ్ శెట్టి ఇందులో జంటగా నటిస్తున్నారు. చాలా ఏళ్ళ తర్వాత ఇందువదన సినిమాతోనే రీ ఎంట్రీ ఇస్తున్నారు వరుణ్ సందేశ్. తాజాగా విడుదలైన ఇందువదన ఫస్ట్ లుక్ చాలా కళాత్మకంగా ఉండటంతో అనూహ్యమైన స్పందన వస్తుంది. అందులో వరుణ్ సందేశ్, ఫర్నాజ్ లుక్ కథాపరంగా చాలా అద్భుతంగా డిజైన్ చేసారు దర్శకుడు MSR. విడుదలైన క్షణం నుంచే ఇందువదన లుక్‌కు మంచి స్పందన వస్తున్నందుకు చిత్ర యూనిట్ చాలా సంతోషంగా ఉండటమే కాకుండా,వరుణ్ సందేశ్ కూడా ఇందువదన సినిమా కోసం తనను తాను కొత్తగా ఆవిష్కరించుకున్నారు. ఈ సినిమాకు కథ, స్క్రీన్ ప్లే, మాటలు సతీష్ ఆకేటీ అందిస్తుండగా.. శివ కాకాని సంగీతం సమకూరుస్తున్నారు. సీనియర్ ఎడిటర్ కోటగిరి వెంకటేశ్వరరావు ఎడిటింగ్ బాధ్యతలు తీసుకున్నారు. త్వరలోనే సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు చిత్ర దర్శక నిర్మాతలు తెలియజేయనున్నారు.