పుష్ప2ని నమ్మలేకపోతున్నారుగా!
మొన్నటికి మొన్న పుష్ప2 సినిమా మరో 200 రోజుల్లో థియేటర్లలోకి రానుందని చిత్ర యూనిట్ అఫీషియల్ గా పోస్టర్ ను రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. నిర్మాతలే స్వయంగా చెప్పినప్పటికీ ఆడియన్స్ కి మాత్రం ఈ విషయాన్ని అంత ఈజీగా నమ్మబుద్ధి కావడం లేదు. పుష్ప రాదని ఆగస్ట్ 15ని వేరే సినిమాలు ఆక్యుపై చేయాలని ఎంతో పోటీ పడుతున్నాయి.
ఏప్రిల్ నుంచి తప్పుకున్న దేవర, ఇదే డేట్ పై కన్నేసినట్లు తెలుస్తోంది. ఒకవేళ దేవర లేకపోతే అప్పుడు నాని సరిపోదా శనివారంను దింపాలనుకుంటున్నాడట. అయితే పుష్ప2 వాయిదా పడుతుందని ఇంత బలంగా ఫిక్స్ అవడానికి కూడా చాలానే రీజన్స్ కనిపిస్తున్నాయి. పుష్ప2 కు సంబంధించిన షూటింగ్ చాలానే బ్యాలెన్స్ ఉంది.
బన్నీ ఫ్రెండ్ గా నటించిన జగదీష్ అరెస్ట్ అవడంతో షూటింగ్ ఇంకా లేట్ అవుతుందని ప్రచారం జరుగుతుంది. కానీ పుష్ప2 టీమ్ ఇప్పటికే రూ.15 లక్షలు ఖర్చు పెట్టి మరీ అతన్ని బెయిల్ మీద బయటకు తీసుకొచ్చిందని అంటున్నారు. ఇక పుష్ప2లో కీలక పాత్ర చేస్తున్న ఫాహద్ ఫాజిల్ చాలా రోజులుగా ఈ షూటింగ్ లో పాల్గొనడం లేదు. సుకుమార్ ఇప్పటికే అతని పాత్ర షూటింగ్ ను ఫినిష్ చేశాడేమో ఎలాంటి క్లారిటీ లేదు. కానీ ఈ వార్తలన్నింటినీ పట్టించుకోకుండా చిత్ర యూనిట్ ఎట్టి పరిస్థితుల్లో సినిమాను చెప్పిన తేదీకి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఏదేమైనా పుష్ప2 పోస్ట్ పోన్ వార్తలకు చెక్ పెట్టాలంటే డైరెక్టరో, హీరోనో క్లారిటీ ఇస్తే తప్ప ఇవి ఆగేలా లేదు.













