ఇంద్రగంటి తో చైతూ సినిమా లేనట్లేనా..?
నాని, సుధీర్ బాబు లాంటి ట్యాలెంటెడ్ హీరోలతో ఇంద్రగంటి సినిమాలు చేస్తూ వెళ్తున్నాడు. ఇటీవల వారిద్దరిని హీరోలుగా పెట్టి తెరకెక్కించిన వీ దారుణమైన పరాజయాన్ని పొందింది. ఇప్పుడు తన తర్వాతి సినిమాను సుధీర్ బాబు తో సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీ తర్వాత ఆయన నాగచైతన్య తో ఒక రొమాంటిక్ ఎంటర్టైనర్ ను తీయడానికి చూస్తున్నట్లు ప్రచారమైంది.
కానీ లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ప్రకారం ఆ ప్రాజెక్ట్ క్యాన్సిల్ అయిందని గుసగుసలు వినిపిస్తున్నాయి. చైతూ ఒక దాని వెంట ఒకటిగా ఇప్పటికే చాలా చిత్రాలకు కమిట్ అయ్యాడు. వీటిలో విక్రమ్ తో చేసే థాంక్యూ, తర్వాత తరుణ్ భాస్కర్ తో కూడా ఒక సినిమా చేయాల్సి ఉంది. ఇటీవలే ఆ స్క్రిప్ట్ లాక్ చేశాడని తెలుస్తుంది.
అంతేకాదు వీటితో పాటూ నాగార్జున హీరోగా చేసే బంగార్రాజు సినిమాలో కూడా చైతూ నటించాల్సి ఉంది. దీని వల్ల డేట్స్ అడ్జస్ట్ చేయలేకపోతున్నాడట చైతూ. రకరకాల కారణాలతో ఇంద్రగంటి ప్రాజెక్ట్ నుంచి చైతూ తప్పుకున్నారని వార్తలొస్తున్నాయి. దీంతో పాటూ చైతూ మాస్ ఎంటర్ టైనర్లలోనే నటించేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడని, అది కూడా ఇంద్రంటి ప్రాజెక్ట్ నుంచి తప్పుకోవడానికి రీజన్ అని చెప్తున్నారు.













