అమెరికాలో దీపిక దోశ
ఇప్పటి వరకు రణవీర్ సింగ్, దీపికా పదుకొనే వివాహం, రిసెష్పన్లతో డిసెంబర్ అంతా వార్తల్లో నిలిచారు. ప్రస్తుత విహార యాత్రలో ఉన్న వీరిద్దరూ మరోసారి సామాజిక మాధ్యమంలో హల్చల్ చేస్తున్నారు. ఏదో సినిమా గానీ, కొత్తగా ఫ్యాషన్ వీక్‌లో మెరిస్తే వార్తల్లో నిలుస్తుంది దీపికా. కానీ ఆమె పేరు మీద దోశ అమ్ముతున్నట్టు తన అభిమాని ఒకరు ఈ బాలీవుడ్ హీరోయిన్‌కు ట్విట్టర్ ఖాతా ద్వారా తెలిపాడు. దానికి సంబంధించిన మెనూ కూడా రోస్టర్ కూడా ఫొటో తీసి పోస్టు చేశాడు. ఇదెక్కడో ఇండియాలో కాదు అమెరికాలోని టెక్సాస్‌లో ఓ హోటల్లో ఉంచిన మెనూలో దీపికా పదుకొనే దోశ అని పెట్టారు. ఈ పోస్టుకు దీపికా స్పందిస్తూ ఈ ఏడాది ఎంతబాగుందని రీట్వీట్ చేసింది. మరో నెటిజన్ ట్వీట్ చేస్తూ పూణేలో కూడా మీ పేరుతో రోటీలు అమ్ముతున్నారు అని పోస్టు చేశాడు. దీనికి రణవీర్ స్పందిస్తూ ఆ రోటీని నేను తింటా అని పేర్కొన్నాడు.













