Mission Santa: కిస్మస్ కానుకగా థియేటర్స్‌లో విడుదలవుతున్న ‘మిషన్ సాంటా’
భారతీయ యానిమేషన్ రంగానికి కీలక మైలురాయిగా ‘మిషన్ సాంటా’
ఇటీవల యానిమేషన్ ఫిలింగా రూపొంది భారతదేశంతో పాటు తెలుగు రాష్ట్రాల్లో విశేష ఆదరణ పొందిన నరసింహా అవతార్ సినిమా గురించి అందరికి తెలిసిందే. ఇప్పుడు తాజాగా మరో యానిమేషన్ ఫీచర్ ఫిలిం రిలీజ్ కాబోతుంది. అంతర్జాతీయ ప్రమాణాలతో రూపొందిన ఈ భారీ యానిమేటెడ్ ఫిలిం ‘మిషన్ సాంటా’. ఈ అత్యుత్తమ యానిమేషన్ ఫీచర్ ఫిలిం ఈ నెల 25న కిస్మస్ కానుకగా భారత్‌తో పాటు ఫ్రాన్స్, జర్మనీ తదితర దేశాల్లో ఒకేసారి ఈ చిత్రం థియేటర్లో సందడి చేయబోతుంది. ఇందులో భాగంగా ఈనెల 25న అంటే అదే రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ప్రధాన నగరాల్లోని పలు థియేటర్లో ‘మిషన్ సాంటా’ రిలీజ్ కాబోతుంది. కుటుంబ సమేతంగా చూడదగ్గ కథతో రూపొందిన హై ఎనర్జీ యానిమేటెడ్ అడ్వెంచర్ చిత్రం ఇది. యానిమేషన్ క్వాలిటీ, సినిమాలో ఉండే ఎమోషన్స్, ఎంటర్టైన్మెంట్, అడ్వెంచరస్ అన్ని మీకు ఓ అద్బుతమైన సినిమాను చూసిన ఫీలింగ్‌ను, ఎక్స్‌పీరియన్స్‌ను ఈ సినిమా ఇవ్వబోతుంది.
అన్ని తరగతుల ప్రేక్షకులు ఈ సినిమాను ఎంజాయ్చేస్తారు. ముఖ్యంగా చిన్నారులు, తల్లిదండ్రులు, తాత ముత్తాలు అందరూ కలిసి వెండితెరపై చూడదగ్గ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఇది. అద్బుతమైన సినిమా టిక్ విజువల్స్, స్పీడ్‌గా ఉండే కథ, కథనాలు, అన్ని వర్గాల వారి మనసులను తాకే ఎమోషన్స్, థ్రిల్లింగ్‌గా ఫీలయ్యే సాహసాలు, ధైర్యంతో కూడిన పాత్రలు ఈ సినిమాలో ఉండే ప్రధాన హైలైట్స్. భారతీయ యానిమేషన్ రంగానికి ఈ సినిమా ఓ కీలక మైలురాయిగా నిలువనుంది. ఈ చిత్రానికి సంబంధించిన కథ, స్క్రిప్ట్ మరియు పాత్రల డిజైన్ లాస్ ఏంజిల్స్‌లో డెవలప్ చేశారు. పూర్తి యానిమేషన్ ప్రొడక్షన్ భారత్‌లో భారతీయ సీనియర్ యానిమేషన్ నిపుణుల పర్యవేక్షణలో జరిగింది. సుమారు 20 నెలల పాటు 150కి పైగా భారతీయ యానిమేషన్ నిపుణులు ఈ చిత్ర నిర్మాణంలో పాల్గొన్నారు. ఈ చిత్రాన్ని నిర్మించిన బ్రాడ్‌విజన్ ఇండియా మరియు స్టూడియో56, భారతీయ యానిమేషన్‌ను కేవలం సేవల స్థాయి నుంచి క్రియేటివ్‌గా, వాణిజ్యపరంగా అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లాలనే లక్ష్యంతో ఈ ప్రాజెక్ట్‌ను రూపొందించాయి. ఇంగ్లీష్ భాషలో విడుదలవుతున్న ఈ చిత్రం ప్రేక్షకులకు ఓ ప్రీమియం యానిమేటెడ్ థియేట్రికల్ అనుభవాన్ని అందించనుంది.






