ఇండియన్3 కచ్ఛితంగా ఉంటుంది: ఉదయనిధి స్టాలిన్
ఒక సినిమాగా మొదలుపెట్టి, ఆ సినిమాను రెండు భాగాలుగా తీయడం ఈ మధ్య ఫ్యాషనైపోయింది. బాహుబలి తీసుకొచ్చిన ఈ ట్రెండ్‌ను అందరూ ఫాలో అవుతున్నారు. పుష్ప సినిమా కూడా మొదలుపెట్టినప్పుడు ఒక భాగమే కానీ తర్వాత అది రెండు భాగాలు చేశారు. ఇప్పుడు ఈ సినిమాకు మూడో పార్ట్ కూడా తీసే ఆలోచన సుకుమార్ కు ఉందంటున్నారు. అందులో నిజమెంతన్నది చూడాలి.
అయితే సౌత్‌లో తెరకెక్కుతున్న మరో భారీ సినిమా ఇండియన్-2 కూడా ఈ సినిమాతో ఆగదట. ఇండియన్ 2 సినిమాకు కొనసాగింపు ఉంటుందని నిర్మాతల్లో ఒకరైన ఉదయనిధి స్టాలిన్ వెల్లడించాడు. ఇండియన్-3 ఉంటుందని ఇంతకుముందే వార్తలొచ్చినప్పటికీ, ఆ వార్తల్లో ఇప్పటి వరకు క్లారిటీ లేదు.
కానీ తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఉదయనిధి మాట్లాడుతూ, ఇండియన్2 సినిమా ఫుటేజ్ చాలా ఎక్కువగా వచ్చిందని, ఈ సినిమా కథ చాలా పెద్దదని, ఇండియన్3 వచ్చే ఛాన్స్ ఉన్నట్లు ఆయన తెలిపాడు. అంతేకాదు, ఈ సినిమాకు కమల్ కొత్తగా మరో 40 రోజుల డేట్స్ ఇచ్చాడని, షూటింగ్ జరుగుతోందని వెల్లడించాడు. అంటే ఇండియన్-3 కచ్ఛితంగా ఉంటుందన్నమాట.













