చరణ్ ఫ్యాన్స్‌కు శంకర్ టెన్షన్
ఇంతకుముందు మెగా పవర్ స్టార్ గా పేరున్న రామ్ చరణ్, ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత గ్లోబల్ స్టార్ గా పేరు తెచ్చుకున్నాడు. దానికి తగ్గట్టే తన సినిమాను తమిళ డైరెక్టర్ శంకర్‌తో సెట్ చేసుకుని ఫ్యాన్స్ కు ఆనందాన్నిచ్చాడు. ఎంతోమంది స్టార్ హీరోలు సైతం శంకర్ తో సినిమా చేయాలనుకున్నప్పటికీ, వారెవ్వరికీ దక్కని ఛాన్స్ చరణ్ కొట్టేశాడని గేమ్ ఛేంజర్ అనౌన్స్ అయిన టైమ్ లో చాలా మంది అనుకున్నారు.
రోబో తర్వాత శంకర్ నుంచి మంచి సినిమా రాకపోయినప్పటికీ, చరణ్ సినిమాతో బౌన్స్ బ్యాక్ అవుతాడని ఫ్యాన్స్ నమ్మారు. కానీ ఏ టైమ్ లో గేమ్ ఛేంజర్‌ను మొదలుపెట్టారో కానీ, సినిమా మొదలై, మూడేళ్లవుతున్నా ఇప్పటికీ అది పూర్తి కాలేదు. దీంతో విసిగిపోయిన చరణ్ ఫ్యాన్స్ సినిమా ఎప్పుడొస్తే ఏంటిలే మంచి కంటెంట్‌తో బ్లాక్ బస్టర్ మూవీ వస్తే చాలనుకున్నారు. కానీ ఇప్పుడు ఆ విషయంలో కూడా అనుమానాలొస్తున్నాయి.
గేమ్ ఛేంజర్ తో పాటూ శంకర్ చేస్తున్న ఇండియన్2 సినిమాకు సంబంధించిన టీజర్ రీసెంట్ గా రిలీజైంది. ఆ టీజర్ లో విజువల్స్ రిచ్ గా కనిపించడం తప్ప ఎక్కడా శంకర్ మార్క్ అసలు కనిపించలేదు. కేవలం టీజర్ ను చూసి ఓ అభిప్రాయానికి రాలేం కానీ రెండు నిమిషాల టీజర్లో ఒక్క షాట్ కూడా శంకర్ మార్క్ లో లేకపోవడంతో, ఇక తమ అభిమాన హీరో రామ్ చరణ్ తో శంకర్ చేస్తున్న గేమ్ ఛేంజర్ ఎలా ఉండబోతుందోననే టెన్షన్ ఫ్యాన్స్ లో ఎక్కువైపోయింది.













