సింపుల్ గా స్టార్ట్ చేసేసిన కమల్ హాసన్- శంకర్ ల ఇండియన్ 2
యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ కెరీర్ బెస్ట్ మూవీస్‌లో ఇండియన్ (భారతీయుడు) ఒకటి. ఈ సినిమా విడుదలై 21 ఏళ్లు అవుతుంది. కానీ ఆ వైబ్స్ మాత్రం ఇంకా తగ్గలేదంటే అతిశయోక్తి కాదు. ఇప్పుడు మళ్లీ కమల్ హాసన్, శంకర్ కాంబినేషన్లో ఇండియన్ సినిమాకు సీక్వెల్‌గా ఇండియన్ 2 షూటింగ్ జరుపుకుంటోంది. నిజానికి ఈ సినిమా ఎప్పుడో విడులద కావాల్సింది. నిర్మాతలకు, శంకర్‌కు మధ్య వచ్చిన క్రియేటివ్ డిఫరెన్సెస్.. కరోనా వంటి కారణాలతో మధ్యలోనే సినిమా షూటింగ్ ఆగిపోయింది. తొలుత దిల్ రాజు బ్యానర్ లో ఇండియన్ 2 సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లడానికి కావాల్సిన చర్చలు జరిగాయి. అదే సమయానికి ఆయన రామ్ చరణ్ హీరోగా ఓ పాన్ ఇండియా మూవీ RC 15ని సెట్స్ పైకి తీసుకెళ్లిపోయాడు. తమ సినిమాను పూర్తి చేయకుండా మరో సినిమా ఎలా చేస్తావంటూ అప్పట్లో ఇండియన్ 2 నిర్మాతలు శంకర్‌పై కేసు వేయటానికి కూడా సిద్ధమయ్యారు.
కానీ..శంకర్ మళ్లీ సినిమాను చేస్తానని సర్ది చెప్పి వ్యవహారాన్ని పెద్దది కాకుండా చూశాడు. మరో వైపు రామ్ చరణ్‌తో చేస్తోన్న RC 15 చిత్రీకరణకు బ్రేక్ పడింది. ఇక్కడ కూడా క్రియేటివ్ డిఫరెన్సెస్ రావటంతోనే ఆగినట్లు టాక్ అయితే బలంగానే వినిపిస్తోంది.ఈ గ్యాప్‌లో శంకర్ ఆగిపోయిన తన ఇండియన్2 సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లిపోయాడు. మంగళవారం రాత్రి నుంచి ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ అయ్యింది. ఈ విషయాన్ని తెలియజేస్తూ కమల్ హాసన్, శంకర్, రకుల్ ప్రీత్ సహా ఇతర నటీనటులు సోషల్ మీడియాలో పోస్టులు కూడా పెట్టేశారు. ఇండియన్ 2కి సంబంధించిన సరికొత్త పోస్టర్‌ను కూడా విడుదల చేశారు. ఈ షెడ్యూల్ కమల్, కాజల్, రకుల్ ప్రీత్ అందరూ పాల్గొంటున్నారు.
https://twitter.com/
https://twitter.com/













