భారీ ధరకు ఇండియన్2 ఓటీటీ రైట్స్
ఇండియన్ సినిమాల్లో క్రేజ్ ఉన్న సినిమాల్లో ప్రస్తుతం సెట్స్ మీదున్న ఇండియన్2 కూడా ఒకటి. పాతికేళ్ల కిందట రికార్డ్స్ క్రియేట్ చేసిన భారతీయుడు సినిమాకు సీక్వెల్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాపై అందరికీ మంచి అంచనాలున్నాయి. డైరెక్టర్ శంకర్ తెరకెక్కిస్తున్న ఇండియన్2లో భారతీయుడులో హీరోగా నటించిన కమల్ హాసనే హీరోగా నటిస్తున్నాడు.
సినిమా మొదలయ్యాక సెట్స్ లో భారీ ప్రమాదం జరగడం, కరోనా కారణంగా సినిమా రెండేళ్లకు పైగా ఆగిపోయింది. గతేడాది మళ్లీ షూటింగ్‌ను రీస్టార్ట్ చేశారు. వచ్చే ఏడాది సమ్మర్ లో ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని దర్శకనిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. కాగా అప్పుడే ఈ సినిమాకు సంబంధించిన బిజినెస్ డీల్స్ మొదలయ్యాయి.
ప్రమఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ ఈ సినిమా ఓటీటీ హక్కుల కోసం మేకర్స్ కు భారీ మొత్తంలో ఆఫర్ చేసిందట. అన్ని భాషల స్ట్రీమింగ్ రైట్స్ కోసం రూ. 220 కోట్లను ఇండియన్2 మేకర్స్ కు నెట్‌ఫ్లిక్స్ కోట్ చేసిందట. ఈ రేటు ఎక్కువ అనిపించినా రిలీజై టైమ్ కు ఈ రేట్‌ని వర్కవుట్ చేయడం పెద్ద కష్టమేమీ కాదని నెట్‌ఫ్లిక్స్ భావిస్తుందట. ఈ వార్త నిజమైతే మాత్రం ఇండియన్ సినిమాల్లోని భారీ డీల్స్ లో ఇది కూడా ఒకటి అవుతుంది.













