భారతీయ చిత్రానికి దక్కిన పురస్కారం
ప్రతిష్టాత్మకంగా భావించే ఆస్కార్ పురస్కారాల్లో భారతీయ చిత్రానికి చోటు దక్కుతుందా అని యావత్ భారతీయ ప్రేక్షకులు ఎంతో ఆశతో ఎదురుచూస్తుంటారు. ఆ ఆశ ఇప్పుడు ఈ ఏడాది ఫలించింది. 2019 ఆస్కార్ పురస్కారాల్లో భారతీయ చిత్రానికి చోటు దక్కింది. అయితే ఇది ఫీచర్ ఫిల్మ్ కాదు. షార్ట్‌ఫిల్మ్ విభాగంలో పిరియేడ్ ఎండ్ ఆఫ్ సంటెన్స్కు బెస్ట్ డాక్యుమెంటరీ పురస్కారం దక్కింది. దీంతో బాలీవుడ్ వర్గాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. అడవాళ్ల పీరియడ్స్ సమస్యలపై రూపొందిన ఈ డాక్యుమెంటరీ లో సానిటరీ న్యాప్కిన్స్కు ఆధ్యుడైన ప్యాడ్‌మెన్ అరుణాచలం మురుగునాధమ్, టుబు నటించారు. గునీత్ మోంగా నిర్మించారు.
ఒక భారతీయ లఘు చిత్రానికి ఆస్కార దక్కటం దేశ చరిత్రలో ఇదే ప్రథమం.. కావటంతో బాలీవుడ్ వర్గాలు ఈ ఆనంద క్షణాలను సెలబ్రేట్ చేసుకుంటున్నాయి. మహిళా చిత్రాలకు మంచి రోజులొచ్చాయి. కంగ్రాట్యులేషన్స్.. గునీత్ చాలా అద్భుతమైన క్షణాలివి.. మా అందరికీ గర్వంగా ఉంది. ఈ డాక్యుమెంటరీని నెట్ ఫ్లిక్స్‌లో చూడటానికి సిద్ధం కండి.. అంటే నేహా దూపియా పెట్టిన పోస్ట్ సోషల్ మీడియాలో ట్విట్టర్లో వైరల్ అవుతుంది.













