బాలీవుడ్ హీరో వివేక్ ఒబెరాయ్ ఇంట్లో సీసీబీ సోదాలు
కన్నడ ఇండస్ట్రీలో డ్రగ్స్ వ్యవహారం కలకలం రేపుతోంది. ఇప్పటికే ఈ కేసులో హీరోయిన్స్ రాగిణి ద్వివేది, సంజన గల్రానీలను అరెస్టు చేసిన విషయం తెలిసిందే. వివేక్ ముంబై నివాసంలో కర్ణాటక పోలీసులు గురువారం సోదాలు నిర్వహించారు. కర్ణాటక మాజీ మంత్రి జీవరాజ్ అల్వా కుమారుడైన ఆదిత్య అల్వా ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్నారు. ఆదిత్య అల్వా పరారీలో ఉన్నారని, వివేక్ నివాసంలో దాక్కున్నారన్న సమాచారం మేరకు ముంబయిలోని ఆయన నివాసంలో సోదాలు జరిపినట్లు బెంగళూరు పోలీస్ కమిషనర్ సందీప్ పాటిల్ అన్నారు. క్రైం బ్రాంచ్ పోలీసులు డ్రగ్స్ కేసులో విచారణను వేగవంతం చేసినప్పటి నుంచి ఆదిత్య అల్వా కనిపించకుండా పోయినట్లు తెలిసింది.













