విడాకులు సిద్దమైన మరో బాలీవుడ్ జంట
8 సంవత్సరాలు ప్రేమించి పెళ్లి చేసుకొని ఓ పాపకి కూడా జన్మనిచ్చిన బాలీవుడ్ జంట విడాకులు తీసుకునేందుకు సిద్ధమైందని బీటౌన్ టాక్. మేటర్లోకి వెళితే జానే తు యా జానే నా సినిమాతో బాలీవుడ్ ఆరంగేట్రం చేసిన ఇమ్రాన్ ఖాన్ తక్కువ సమయంలో లవర్ బోయ్‌గా మారాడు. ఎందరో అమ్మాయిల మనసులు దోచుకున్న ఇమ్రాన్ తాను 8 ఏళ్ళుగా ప్రేమించిన అవంతిక మాలిక్‌ని జనవరి 10,2011న వివాహమాడాడు. 2014లో వీరికి ఓ పాప కూడా జన్మించింది. కాని ఆ తర్వాత మెల్ల మెల్లగా అతడు హీరోగా ఫ్లాప్ అవుతూ వచ్చాడు. ఒకానొక దశలో క్యారెక్టర్ ఆర్టిస్టుగా కూడా ప్రయత్నాలు చేశాడు. కాని అలా కూడా అతడు సఫలం కాలేదు అతడికి ఆఫర్లు దక్కలేదు. దాంతో నటనను పక్కన పెట్టి డైరెక్షన్ కూడా ప్రయత్నించాడు. ఒక వైపు సినీ కెరీర్ ఏమాత్రం ఆశాజనకంగా లేని ఈ సమయంలో మరో వైపు వైవాహిక జీవితంలో కూడా సమస్యలు తలెత్తాయి.













