ఆకట్టుకుంటున్న మిస్టరీ థ్రిల్లర్స్
గతేడాది కన్నడ నుంచి వచ్చి టాలీవుడ్ లో పెద్ద హిట్ అయిన కాంతార సినిమా ఎంత సెన్సేషన్ సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆ సినిమా హిట్ అవడంతో అదే కోవలో వరుసగా సినిమాలను రెడీ చేస్తున్నారు. అవును. ప్రెజెంట్ టాలీవుడ్ లో బాగా క్లిక్ అవుతున్న జానర్ ఏదైనా ఉందంటే అది మిస్టరీ థ్రిల్లరే.
హర్రర్ స్టోరీలనే కొంచెం డిఫరెంట్ గా ప్రెజెంట్ గా చేసి ఆడియన్స్ ను ఎంగేజ్ చేసే స్క్రీన్ ప్లే తో ట్విస్ట్ లతో ఉక్కిరి బిక్కిరి చేస్తూ థ్రిల్ చేస్తున్నారు ఫిల్మ్ మేకర్స్. అలాంటి సినిమాలకే ఆడియన్స్ బ్రహ్మరథం పడుతున్నారు. ఈ ఇయర్ సమ్మర్ లో వచ్చిన విరూపాక్ష ఎంత మంచి విజయాన్ని అందుకుందో తెలిసిందే. ఈ సినిమా సాయి ధరమ్ తేజ్ కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. ప్రస్తుతం దానికి సీక్వెల్ కోసం ట్రై చేస్తున్నారు మేకర్స్.
రీసెంట్ గా ఇదే జానర్ నుంచి వచ్చిన పొలిమేర2 కూడా బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్లను రాబట్టింది. చిన్న సినిమాగా రిలీజైన ఈ సినిమా మంచి వసూళ్లను రాబట్టుకుంది. పొలిమేర అనే ఓటీటీ సినిమాకు సీక్వెల్ గా వచ్చిన ఈ మూవీకి మరో సీక్వెల్ ఉన్నట్లు మేకర్స్ ఇప్పటికే అనౌన్స్ చేశారు. దానికి తగ్గట్లే పొలిమేర2లో హింట్ కూడా ఇచ్చారు.
ఇక తాజాగా అజయ్ భూపతి దర్శకత్వంలో వచ్చిన మంగళవారం సైతం ఇదే జానర్లో తెరకెక్కి ప్రేక్షకుల్ని మెప్పిస్తోంది. ఈ కథను అజయ్ భూపతి నడిపించిన విధానం ఆడియన్స్ ను మెప్పిస్తోంది. శుక్రవారం రిలీజైన ఈ సినిమా మంచి టాక్‌తో పాటూ ఓపెనింగ్స్ ను కూడా తెచ్చుకుంది. ఈ జానర్ లో వస్తున్న సినిమాలు వరుసగా హిట్ అవుతుండటంతో నిర్మాతలు ఈ జానర్‌పై ఎక్కువ ఫోకస్ పెడుతున్నారు.













