ప్రపంచంలోనే అత్యంత ప్రజాదరణ పొందిన భారతీయ తారలు వీరే…
సినిమా, టీవీ మరియు సెలబ్రిటీ కంటెంట్ కోసం ప్రపంచంలో అత్యంత ప్రజాదరణ పొందిన మరియు అధికారిక మూలమైన ఐఎండిబి, నేడు 2022లో అత్యంత ప్రజాదరణ పొందిన భారతీయ తారలను ప్రకటించింది. దాని ఖచ్చితమైన టాప్ 10 జాబితాలను ఐఎం డిబి 200 మిలియన్ల కంటే ఎక్కువ ఉన్న నెలవారీ సందర్శనకుల వాస్తవ పేజీ వీక్షణల ఆధారంగా నిర్ణయిస్తుంది. ది గ్రే మ్యాన్ మరియు తిరుచిత్రంబలం వంటి బహుభాషా చిత్రాల విజయవంతమైన విడుదలతో అభిమానుల ఆసక్తిని పెంచిన ధనుష్ ఈ సంవత్సరం అగ్రస్థానం పొందిన సెలబ్రిటీగా గుర్తింపు పొదాడు. ఇక 2022లో ప్రజాదరణ పొందిన భారతీయ తారలు ఇలా ఉన్నారు. ధనుష్, ఆలియా భట్, ఐశ్వర్య రాయ్ బచ్చన్, రామ్ చరణ్ తేజ, సమంతా రూత్ ప్రభు, హృతిక్ రోషన్, కియారా అద్వానీ, ఎన్.టి. రామారావు జూనియర్, అల్లు అర్జున్, యష్లకు ఈ జాబితాలో చోటు దక్కింది.













