Imanvi Esmail: ప్రభాస్ హీరోయిన్ డిమాండ్ మామూలుగా లేదుగా
అసలు అప్పటివరకు ఎవరో కూడా తెలియని ఇమాన్వి ఇస్మాయెల్(Imanvi Esmail) ప్రభాస్(Prabhas) సరసన హీరోయిన్ గా సెలెక్ట్ అవగానే ఒక్కసారిగా తనకు ఇతర భాషల దర్శకనిర్మాతల నుంచి కూడా కాల్స్ వస్తున్నట్లు సమాచారం. హను రాఘవపూడి(Hanu Raghavapudi) దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా రూపొందుతున్న ప్రీ ఇండిపెండెన్స్ పీరియాడిక్ డ్రామా ద్వారా మొదటి సినిమానే ఇంత పెద్ద బ్రేక్ అంటే ఇమాన్వి లక్ మామూలుగా లేదు.
ఇదిలా ఉంటే ఇమాన్విపై ఇప్పుడు బాలీవుడ్ నిర్మాతల కన్ను పడ్డట్టు తెలుస్తోంది. అయితే ప్రభాస్ సినిమా పూర్తయ్యే వరకు ఇమాన్వి వేరే సినిమాలు ఒప్పుకోకూడదని మైత్రీ మూవీ మేకర్స్(Mythri Movie Makers) అగ్రిమెంట్ చేసుకుందని గతంలోనే వార్తలొచ్చాయి. కానీ ఇప్పుడు టీ సిరీస్(T Series) ఇమాన్వి కోసం ట్రై చేస్తున్నట్లు తెలుస్తోంది.
కార్తీక్ ఆర్యన్(Karthik Aaryan) హీరోగా అనురాగ్ బసు(Anurag Basu) దర్శకత్వంలో రూపొందనున్న రొమాంటిక్ మూవీ కోసం భూషణ్ కుమార్(Bhushan Kumar) ఇమాన్విని ట్రై చేస్తున్నట్టు సమాచారం. ప్రభాస్- హను రాఘవపూడి సినిమాకు భూషణ్ కుమార్ కూడా ఒక నిర్మాత. ఈ నేపథ్యంలోనే ఎలాగైనా ఇమాన్వి రెండో సినిమాను తమకు లాక్ చేయించేలా ఆయన విశ్వ ప్రయత్నాలు చేస్తున్నట్టు సమాచారం. అసలు స్క్రీన్ పై ఎలా కనిపిస్తుందో, ఎలా నటిస్తుందో తెలియని ఇమాన్వికి ఇంత డిమాండ్ రావడం చూస్తుంటే అమ్మడు నక్క తోక తొక్కినట్టే అనిపిస్తుంది.













