Genelia: నా హీరోలను చూసి గర్వపడుతున్నా

సత్యం(satyam), ఢీ(Dhee), రెడీ(Ready), బొమ్మరిల్లు(Bommarillu) లాంటి ఎన్నో సక్సెస్‌ఫుల్ సినిమాల్లో నటించిన జెనీలియా(Genelia) స్టార్ హీరోలతో నటించిన ప్రతీ సినిమా ఆమెకు నిరాశనే మిగిల్చింది. ఎన్టీఆర్(NTR) తో జెనీలియా రెండు సినిమాలు చేసింది. నా అల్లుడు(Naa Alludu), సాంబ(Samba). ఆ రెండూ ఫ్లాపులుగానే నిలిచాయి. అల్లు అర్జున్(Allu Arjun) తో చేసిన హ్యాపీ(Happy) ఫ్లాపే. రామ్ చరణ్(Ram Charan) తో చేసిన ఆరెంజ్(Orange) ఏ రేంజ్ లో డిజాస్టర్ అయిందో చెప్పాల్సిన పన్లేదు.
గత 13 ఏళ్లుగా తెలుగు సినిమాకు దూరంగా ఉన్న జెనీలియా ఇప్పుడు జూనియర్(junior) అనే సినిమాతో కంబ్యాక్ ఇస్తున్న విషయం తెలిసిందే. జూనియర్ మూవీలో జెనీలియా కీలక పాత్రలో కనిపించబోతున్నారు. కంబ్యాక్ సినిమా కావడంతో ప్రమోషన్స్ లో యాక్టివ్ గా పాల్గొంటున్న జెనీలియా పలు ఇంట్రెస్టింగ్ విషయాల గురించి మాట్లాడుతున్నారు. అందులో భాగంగానే తన పాత హీరోల గురించి జెనీలియా కామెంట్ చేశారు.
ఎన్టీఆర్, రామ్ చరణ్, అల్లు అర్జున్ కేవలం తన కో యాక్టర్స్ మాత్రమే కాదని, వారు తన ఫ్రెండ్స్ కూడా అని జెనీలియా చెప్పారు. వారిలో ఎంతో టాలెంట్ ఉందని, ఇన్నేళ్లుగా వాళ్లు పడని కష్టానికే ఇప్పుడు వాళ్లని ఆ స్థాయిలో నిలబెట్టిందని, ముగ్గురు హీరోలనూ పాన్ ఇండియా స్టార్లుగా చూసి గర్వంగా అనిపిస్తుందని జెనీలియా అన్నారు.