గోవా బ్యూటీకి సైతం తప్పలేదంట
తన మాజీ ప్రియుడు ఆండ్రూను తీసేసినా తన మనసు నుంచి మాత్రం అతడ్ని తీసేయలేకపోతోంది గోవా బ్యూటీ ఇలియానా. అతడి జ్ఞాపకాల్ని మరిచిపోవడానికి చాలా కష్టపడ్డానని చెప్పుకొచ్చింది. ఒక దశలో మానసికంగా చాలా కుంగిపోయానని, తట్టుకోలేక రోజుకు 12 టాబ్లెట్స్ వేసిన సందర్భాలు కూడా ఉన్నాయని చెప్పుకొచ్చింది. అలా మానసికంగా కూడా తనను ఆండ్రూ చాలా ఇబ్బంది పెట్టాడని చెప్పుకొచ్చింది. వారం రోజుల పాటు ట్రీట్మెంట్ తీసుకోవడంతో ఇప్పుడంతా సెట్ అయిందని చెబుతోంది. అతిగా టాబ్లెట్స్ వేసుకోవడం వల్ల లావెక్కానని, తగ్గడానికి జిమ్‌కు వేళ్తే, ఎక్కడ తన ఫొటోలు తీసి నెట్లో పెడతారనే భయంలోనే ఇంట్లోనే ఉండిపోయానని చెప్పుకొచ్చింది. తనకు తెలిసిన పద్ధతుల్లో, ఇంట్లోనే అందుబాటులో ఉన్న జిమ్ కసరత్తులు చేసి తగ్గానంటోంది ఇలియానా. ప్రస్తుతం తను జిమ్‌కు వెళ్లే పొజిషన్లో ఉన్నట్టు చెప్పుకొచ్చింది.













