ఇలియానాకు బంపర్ ఆఫర్!
చాలా కాలంగా తెలుగు సినిమాలకు దూరంగా ఉన్న ఇలియానా అతి త్వరలోనే మళ్ళీ తెలుగు తెరపై మెరవనుంది. లేటైనా లేటెస్ట్గా ఓ మంచి బంపర్ ఆఫర్ అందుకుందని సమాచారం. పవన్ కళ్యాణ్ ప్రస్తుతం వకీల్‌సాబ్ చిత్రంలో నటిస్తున్నారు. అమితాబ్ బచ్చన్ నటించిన బాలీవుడ్ చిత్రం పింక్. ఈ చిత్రాన్ని తెలుగులో వకీల్‌సాబ్ గా రీమేక్ చేస్తున్నారు. ఈ చిత్రంలో పవన్‌కళ్యాణ్ సరసన శ్రుతిహాసన్ నటించనుందనే వార్తలొచ్చాయి. అయితే ఈ చిత్రంలో తాను నటించడం లేదంటూ శ్రుతి హాసన్ సోషల్ మీడియా వేదికగా చెప్పేసింది. దీంతో పవన్ సరసన నటించే కథానాయిక ఎవరనే ప్రశ్నకు ఇలియానా రూపంలో సమాధానం దొరికినట్టు తెలుస్తోంది. చిత్ర బృందం ఇలియానాని దాదాపు ఖరారు చేసినట్టు సమాచారం. జల్సా చిత్రంలో పవన్‌కి జోడిగా ఇలియానా నటించిన విషయం తెలిసిందే.













