బ్యాక్ టూ బాలీవుడ్… గోవా బ్యూటీ
గోవా బ్యూటీ ఇలియానా మళ్లీ బాలీవుడ్‌కు చెక్కేస్తోందట. టాప్ బ్యూటీగా తెలుగు, తమిళంలో కొన్నేళ్ల క్రితం స్టార్‌డమ్‌ను దక్కించుకున్న ఇల్లూ బేబీ, తెలుగులో ఒకప్పుడు అందరూ స్టార్ హీరోలతో నటించి మెప్పించింది. గ్లామర్‌తో స్టార్ హీరోయిన్గా గుర్తింపు దక్కించుకున్న ఇలియానా బాలీవుడ్లో అవకాశం రావడంతో అక్కడికి ఎగిరిపోయింది. బాలీవుడ్లో కొంతకాలం జర్నీ సాఫిగానే సాగినా, తరువాత అక్కడా ఒడిదుడుకులు తప్పలేదు. కెరీర్ క్రైసిస్‌లో పడిన టైంలోనే సౌత్ నుంచి అమర్ అక్బర్ ఆంటోని ఆఫర్ రావడంతో బాలీవుడ్ బై బై చెప్పేసి వచ్చేసింది గోవా బ్యూటీ. అయితే సినిమా విడుదలైన తర్వాత ఆమె సినిమాలో ఉండటం సినిమాకే మైనస్ అన్న టాక్ వచ్చింది. ఇలియానా బాగా లావు అవ్వడంతోపాటు ఆమె మొహంలో మునపటి ఆకర్షణ లేదు. దాంతో ఇలియానాను ప్రేక్షకులు తిరస్కరించారు. ఈ సినిమా అటర్ ప్లాప్ అవ్వడంతోపాటు తన లుక్‌పై తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చిన కారణంగా ఇలియానా మళ్లీ బాలీవుడ్‌కు వెళ్లాలని నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది.













