Ikkis vs Ek din: క్లాష్ కు రెడీ అయిన నెపో కిడ్స్

సినీ ఇండస్ట్రీలో పోటీ అన్నది చాలా సహజం. అయితే ఇప్పుడు స్టార్ పిల్లలు ఇద్దరు ఒకే రోజు తమ తమ సినిమాలతో పోటీ పడనుండటంతో ఆ పోటీ మరింత ఇంట్రెస్టింగ్ గా మారింది. భారీ అంచనాలతో రానున్న ఆ ఇద్దరి స్టార్ కిడ్స్ సినిమాల్లో ఎవరి సినిమాకు మంచి రెస్పాన్స్ వస్తుందనేది తెలుసుకోవడానికి అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ఆ స్టార్ కిడ్స్ ఎవరో కాదు.. జునైద్ ఖాన్(junaid khan) మరియు అగస్త్య నంద(agasthya nanda). వీరిద్దరి సినిమాలూ నవంబర్ 7న పోటీ పడనున్నాయి. శ్రీరామ్ రాఘవన్(Sri ram raghavan) దర్శకత్వంలో అగస్త్య నంద చేసిన ఇక్కీస్(ikkis) సినిమా, సునీల్ పాండే(suneel pandey) దర్శక్వంలో జునైద్ ఖాన్ నటించిన ఏక్ దిన్(Ek Din) సినిమా రెండూ ఒకే రోజున రిలీజ్ కానున్నాయి. మామూలుగా అయితే ఇక్కీస్ అక్టోబర్ 2న రిలీజ్ కావాలి.
కానీ అక్టోబర్ 2న కాంతార చాప్టర్1(Kanthara chapter1)తో పాటూ సన్నీ సంస్కారీ కీ తులసి కుమారి(Sunny sanskari ki tulasi kumari) సినిమాలు షెడ్యూల్ అయి ఉన్నాయి. ఈ రెండు సినిమాలకీ భారీ క్రేజ్ తో పాటూ సినిమాలో స్టార్ క్యాస్టింగ్ ఉండటం వల్ల అంత భారీ పోటీలో తమ సినిమాను రిలీజ్ చేయడం ఎందుకని ఇక్కీస్ ను వాయిదా వేస్తూ నవంబర్ లో రిలీజ్ చేయడానికి నిర్మాత దినేష్ విజన్(Dinesh Vijan) డిసైడ్ అయినట్టు తెలుస్తోంది. దీంతో ఇప్పుడు నెపో కిడ్స్ ఇద్దరూ ఒకే రోజున క్లాష్ కు రెడీ అవుతున్నారు. మరి ఈ ఇద్దరిలో ఎవరు విజయం సాధిస్తారో చూడాలి.