Adivi Sesh: మా అక్కను పెళ్లి చేసుకుంటే నేనూ రెడీ ! అడవిశేష్ కు ఆఫర్ ఇచ్చిన బిగ్ బాస్ బ్యూటీ..

టాలీవుడ్ యంగ్ హీరో అడవి శేష్ (Adivi Sesh) గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. భిన్న కథలను ఎంచుకుంటూ వరుస సినిమాలతో ప్రేక్షకులను అల్లరిస్తున్నారు. ఈ మధ్యకాలంలో అడవిశేష్ నటిస్తున్న సినిమాలు కూడా మంచి విజయం సాధిస్తున్నాయి. కాగా హీరో అడవిశేష్ నటించినది తక్కువ సినిమాలే అయినప్పటికీ మంచి క్రేజ్ ని సొంతం చేసుకున్నాడు. కెరియర్ ఆరంభంలో చిన్న చిన్న పాత్రలు చేస్తూ అలరించిన అడవి శేష్ ప్రస్తుతం హీరోగా నటిస్తూ ఫుల్ బిజీ బిజీగా ఉన్నారు. ప్రస్తుతం హీరోగా వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. గూఢచారి, హిట్ 2, ఎవరు, మేజర్, సినిమాలతో హిట్స్ అందుకున్నాడు శేష్. త్వరలోనే మరో రెండు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు అడవి శేష్. కాగా ఇటీవలే నేచురల్ స్టార్ నాని హీరోగా నటించిన హిట్ 3 సినిమాలో గెస్ట్ రోల్ లో కనిపించి ఆకట్టుకున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం గూఢచారి 2 సినిమాతో పాటు డెకాయిట్ సినిమాలో నటిస్తున్నాడు.
ఇదిలా ఉంటే తాజాగా అడవి శేష్ ఒక డాన్స్ టీవీ షోకు హాజరయ్యాడు. ఈ షోలో ఉన్న బిగ్ బాస్ బ్యూటీ అశ్వినిశ్రీ (Ashwini Sri) అడవి శేష్ ను చూసి షాక్ అయ్యింది. శేష్ ను చూసి సర్ ప్రైజ్ అయిన అశ్వినిశ్రీ మా అక్కకు మీరంటే చాలా ఇష్టం అని శేష్ కు చెప్పింది. మా అక్కకు మీరంటే చాలా ఇష్టం అని అశ్విని చెప్పగానే…. శేష్ కూడా నాకు మీ ఫ్యామిలీ అంటే చాలా ఇష్టం అని చెప్పాడు. ఆ తర్వాత మా అక్కను పెళ్లి చేసుకున్నారనుకోండి. మీకు వన్ ప్లస్ వన్ ఆఫర్ వస్తుంది అని చెప్పి షాక్ ఇచ్చింది. దాంతో అక్కడ ఉన్నవారందరూ షాక్ అయ్యారు. అక్కను పెళ్లి చేసుకుంటే నేనూ వస్తాను అని అశ్విని చెప్పగానే శేష్ అవాక్ అయ్యాడు. ఎలా వస్తాననేది కూడా చెప్తాననేసరికి శేష్ నవ్వుతూ సరే సరే అంటూ ఆపేశాడు. ఇందుకు టీవీ షోకు సంబంధించిన ప్రోమోను విడుదల చేశారు మేకర్స్. ఈ ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.