నెక్ట్స్ లెవెల్లో ఐకాన్ స్టార్ లైనప్
పుష్ప సినిమాతో తన క్రేజ్ ను ప్రపంచ వ్యాప్తంగా చాటి చెప్పిన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో పుష్ప2 సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. పుష్పకు నేషనల్ అవార్డ్ రావడంతో ఈ సినిమాను మరింత జాగ్రత్త తీసుకుని మరీ చేస్తున్నారట సుకుమార్, బన్నీలు. అయితే పుష్పతో తనకొచ్చిన క్రేజ్ ను తర్వాతి సినిమాలకు కూడా ఉపయోగించుకోనున్నాడు బన్నీ.
అందులో భాగంగానే బన్నీ తన తర్వాతి సినిమాలన్నింటినీ ముందుగానే ఫిక్స్ చేసుకుంటున్నాడు. పుష్ప2 తర్వాత బన్నీ, బోయపాటి శ్రీనుతో ఓ సినిమా చేయనున్నాడని తెలుస్తోంది. ఇప్పటికే ఈ సినిమాకు బన్నీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఆ తర్వాత త్రివిక్రమ్ తో ఓ సోషియో ఫాంటసీ సినిమా చేయనున్నాడు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన అనౌన్స్మెంట్ కూడా వచ్చేసింది.
ఆ తర్వాత సందీప్ రెడ్డి వంగాతో ఓ యాక్షన్ సినిమాకు కమిట్ అయ్యాడు బన్నీ. ఈ ప్రాజెక్ట్ కు సంబంధించిన అనౌన్స్మెంట్ కూడా ఇప్పటికే వచ్చేసింది. వీటన్నింటితో పాటూ రీసెంట్ గా జవాన్ తో మంచి హిట్ అందుకున్న అట్లీ తో కూడా బన్నీ ఓ సినిమా చేయనున్నాడని తెలుస్తోంది. ఇవన్నీ చూస్తుంటే బన్నీ లైనప్ మామూలుగా లేదుగా అనిపించక మానదు. మరి వీటిలో ఏ సినిమా మొదట సెట్స్ పైకి వెళ్లనుందో చూడాలి.













