Meenakshi Chaudhary: ఇకపై అలాంటి క్యారెక్టర్లు చేయను
ఇచ్చట వాహనములు నిలుపరాదు(Ichata vahanamulu niluparadhu) సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన మీనాక్షి చౌదరి(Meenakshi chaudhary) ఆ తర్వాత హిట్2(Hit2) మూవీలో నటించి మంచి సక్సెస్ ను అందుకుంది. హిట్2 తర్వాత మీనాక్షికి తెలుగులో మంచి అవకాశాలొచ్చాయి. తక్కువ టైమ్ లోనే మంచి ఆఫర్లు అందుకుని సక్సెస్ఫుల్ హీరోయిన్ గా పేరు తెచ్చుకుంది మీనాక్షి.
లక్కీ భాస్కర్(Lucky Baskhar), సంక్రాంతికి వస్తున్నాం(sankranthiki vasthunnam) సినిమాలతో వరుస హిట్లను అందుకున్న మీనాక్షి రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో పాల్గొని అందులో కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. లక్కీ భాస్కర్ కథ నచ్చడం వల్లే ఆ సినిమాలో పిల్లాడికి తల్లిగా నటించానని, కానీ ఇకపై పిల్లల తల్లిగా కనిపించే పాత్రలను చేయనని చెప్పిన మీనాక్షి పెద్ది హీరోలతో కలిసి చేసిన ఫ్లాపైతే దానికి తనను బాధ్యురాలిని చేశారని చెప్పింది.
సీనియర్ హీరోలతో కలిసి నటించడానికి తనకు ఎలాంటి ఇబ్బందులు లేవని, దాన్ని ఓ కొత్త జానర్ గా చూస్తానని చెప్పిన మీనాక్షి, వెంకీ(Venky)తో కలిసి సంక్రాంతికి వస్తున్నాం మూవీని చేస్తున్నప్పుడు చాలా ఎంజాయ్ చేశానని, చిరూ(Chiru)తో కలిసి విశ్వంభర(Viswambhara)లో నటించడం మంచి ఆఫర్ గా భావిస్తున్నట్టు చెప్పింది. సౌత్ ఇండియన్న కల్చర్ అంటే ఇష్టమని చెప్తున్న మీనాక్షి, రూమర్ల విషయంలో మాత్రం తనకు చాలా కోపమొస్తుందని చెప్పింది.







