Renu Desai: సన్యాసం తీసుకుని ఆశ్రమానికి వెళ్తా

ఒకప్పుడు హీరోయిన్ గా ఎంతోమంది ఆడియన్స్ ను అలరించిన రేణూ దేశాయ్(renu desai), పవన్ కళ్యాణ్(pawan kalyan) ను ప్రేమించి పెళ్లి చేసుకుని, ఇద్దరు పిల్లలకు తల్లైంది. తర్వాత కొన్ని కారణాల వల్ల ఆయన్నుంచి విడాకులు తీసుకుని ప్రస్తుతం పిల్లలతో కలిసి పూణెలో సెటిలైన రేణూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ ఎప్పుడూ ఏదొక విషయంతో వార్తల్లో నిలుస్తూనే ఉంటుంది.
అయితే పవన్, రేణూ విడిపోయాక పవన్ మరో పెళ్లి చేసుకుంటే రేణూ మాత్రం పిల్లలను చూసుకుంటూ ఒంటరిగానే ఉండిపోయింది. అందరిలానే తనకు కూడా ఓ తోడు కావాలని భావించిన రేణూ, కరోనా టైమ్ లో ఓ వ్యక్తితో నిశ్చితార్థం కూడా చేసుకున్న సంగతి తెలిసిందే. కానీ తర్వాత పవన్ అభిమానుల ధాటికి తట్టుకోలేక దాన్ని క్యాన్సిల్ చేసుకున్నాని చాలా సార్లు చెప్పింది రేణూ.
నిశ్చితార్థాన్ని క్యాన్సిల్ చేసుకున్నప్పటికీ తనకు రెండో పెళ్లి ఆలోచన ఉందని చెప్పిన రేణూ తాజాగా చేసిన కామెంట్స్ ఆసక్తికరంగా మారాయి. తాను మరో సంవత్సరం మాత్రమే ఇలా ఉంటానని, తర్వాత సన్యాసం తీసుకుని ఆశ్రమానికి వెళ్లే అవకాశాలున్నాయని హింట్ ఇచ్చింది. అయితే తాను సన్యాసం తీసుకోవాలని అనుకోవడానికి గల కారణాల్ని మాత్రం రేణూ వెల్లడించలేదు. మొన్నటివరకు ఇంకో పెళ్లి చేసుకుంటానని చెప్పిన రేణూ ఇప్పుడు సడెన్ గా ఇలా మాట్లాడటానికి రీజన్ ఏమై ఉంటుందా అని అందరూ ఆలోచిస్తున్నారు.