కాజల్ అగర్వాల్ కు వింత వ్యాధి..
కాజల్ అగర్వాల్ తన అందచందాలతో ప్రేక్షకులని ఎంతగా మైమరపిస్తుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పాలరాతి శిల్పంలా కనిపించే కాజల్ వెనుక ఓ విషాదం ఉందని తెలిసి.. అభిమానులు చాలా ఎమోషనల్ అవుతున్నారు. కాజల్‌కు ఐదేళ్ల వయసు ఉన్నప్పుడు బ్రాంకియల్ ఆస్తమా అటాక్ అయిందట. దీని వలన ఆహారం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవలసి వచ్చేదట. శీతాకాలం వస్దే బ్రాంకియల్ ఆస్తమా లక్షణాలు మరింత ఎక్కువ కావడంతో తాను చాలా ఇబ్బందులు పడినట్టు చెప్పుకొచ్చింది కాజల్.
బ్రాంకియల్ ఆస్తమా నుండి బయట పడేందుకు ఇన్హేలర్ వాడగా, అది బాగా పని చేసిందని కాజల్ అంటుంది. ఇప్పటికే నా వెంట ఓ ఇన్హెలర్ ఉంటుంది. అయితే మనదేశంలో చాలా మందికి కూడా ఇన్హేలర్ అవసరం ఉంటుంది. కాని దానిని వాడడానికి సిగ్గుపడుతుంటారు. ఎవరు ఏమనుకుంటారో అని మదనపడుతుంటారు. వాటికి స్వస్తి చెబుదాం. సే ఎస్ టు ఇన్ హేలర్స్ అందాం అని సోషల్ మీడియాలో పోస్టు పెట్టింది కాజల్.













