Rashmika Mandanna: ఆ టైమ్ లో మట్టి వాసన అంటే చాలా ఇష్టం

నేషనల్ క్రష్ రష్మిక మందన్నా(Rashmika Mandanna) ప్రస్తుతం వరుస మూవీస్ తో చాలా బిజీగా ఉంది. పలు భాషల్లో సినిమాలు చేస్తూ తన డైరీని ఫుల్ బిజీగా నింపేసుకున్న రష్మిక ప్రస్తుతం బాలీవుడ్ లో థామ(Thama) అనే సినిమా చేస్తుంది. ఆదిత్య సర్పోత్దార్(Aditya Sarpotdar) దర్శకత్వంలో ఆయుష్మాన్ ఖురానాతో కలిసి నటిస్తున్న ఈ సినిమాతో పాటూ తెలుగులో కుబేర(Kubera), ది గర్ల్‌ఫ్రెండ్(The Girlfriend), రెయిన్ బో(Rainbow) కూడా చేస్తోంది.
రష్మిక ఓ వైపు సినిమాల్లో నటిస్తూ చాలా బిజీగా ఉన్నప్పటికీ తన ఫ్యాన్స్ తో మాత్రం రెగ్యులర్ గా టచ్ లోనే ఉంటుంది. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ అప్డేట్స్ ఇచ్చే రష్మిక తన ఇన్‌స్టాగ్రమ్‌లో తాజాగా ఓ స్టోరీ పెట్టింది. ఈ స్టోరీని చూసిన వారంతా రష్మిక హీరోయిన్ అయినప్పటికీ తన టేస్ట్ కూడా సాధారణ వ్యక్తుల్లానే ఉంటుందని అంటున్నారు.
రష్మిక తన ఇన్‌స్టా స్టోరీలో వర్షం పడుతున్న వీడియోను షేర్ చేస్తూ ఓ నోట్ ను రాసింది. వర్షాలొచ్చేశాయి. వర్షాలంటే నాకు పెద్దగా నచ్చదు. దానికి కారణం వర్షం వల్ల ప్రతీదీ ఎంతో ఆలస్యంగా జరుగుతుంది. కానీ వర్షం పడేటప్పుడు ముందుగా వచ్చే మట్టి వాసన మాత్రం ఎంతో బావుంటుందని, ఆ వాసన అంటే తనకెంతో ఇష్టమని, ఆ ఫీలింగ్ ఎంతో గొప్పగా ఉంటుందని రష్మిక తన స్టోరీలో తెలిపింది.
https://www.instagram.com/stories/direct/3638943987891370470_1381101303?hl=en