ఇంక నన్ను వదిలెయ్యండి…కన్నుకొట్టుడు నావల్ల కాదు
స్టైల్‌గా కన్నుగీటి ఓవర్ నైట్ స్టార్ అయిపోయింది. జస్ట్ 30 సెకన్ల ప్రోమోతో ప్రపంచం మొత్తం పాపులర్ అయ్యింది. అలాంటి ప్రియా వారియర్‌కు ఇప్పుడు కష్టాలు మొదలయ్యాయి. ఎక్కడికి వెళ్లినా జనాలు సెలబ్రిటీలు కన్ను కొట్టమనే అడుగుతున్నారట. దీంతో కన్ను కొట్టి కొట్టి తన కళ్లు పోయేలా ఉన్నాయని బాధపడుతుంది. మొన్నటికి మొన్న లవర్స్ డే ఆడియో ఫంక్షన్‌కి వచ్చినప్పుడు కూడా అల్లు అర్జున్‌ని చూసి కన్నుకొట్టింది. తన సిగ్నేచర్ మూవెంట్తో అందర్ని అలరించింది. సెలబ్రిటీలు కాబట్టి తన సినిమా ఆడియో పంక్షన్ కాబట్టి తప్పదు. కానీ ఎక్కడికి వెళ్లినా ఇలా కన్ను కొట్టమని జనాలు తెగ ఇబ్బంది పెట్టేస్తున్నారు. దీంతో ప్రియా వారియర్‌కు కోపం వచ్చింది. ఇప్పటికే ఏ సారు అడిగినా కాదనకుండా కొన్ని వేలసార్లు కన్ను కొట్టి ఉంటాను. ఇంక నన్ను వదిలెయ్యండి అంటూ వయ్యారాలు పోతోందంట ఈ మలయాళీ ముదుగుమ్మ.













