నేనొక ఛాంపియన్‌లా ఫీలవుతా
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఉపాసనను పెళ్లి చేసుకున్న కొత్తలో సోషల్ మీడియాలో వచ్చే కామెంట్లతో ఇబ్బందులు పడ్డాడు. ఉపాసనను బాడీ షేమింగ్ చేశారు. ఉపాసనను పెళ్లి చేసుకున్నందుకు చరణ్ సైతం ట్రోలింగ్ ఎదుర్కొన్నాడు. అంతేకాదు వీరిద్దరూ ఇప్పటి వరకు పిల్లల్ని కనకపోవడంపై కూడా నెటిజన్లు కామెంట్ చేసిన సంగతి తెలిసిందే.
ఇదిలా ఉండే ఉపాసన త్వరలోనే ఓ బిడ్డకు జన్మనివ్వబోతుంది. రీసెంట్గా ఉపాసన ఓ ఇంటర్వ్యూలో తను పెళ్లి తర్వాత ఎదుర్కొన్న ఇబ్బందులు, ట్రోలింగ్ గురించి మాట్లాడింది. ఆ ఇంట్వర్యూలో గతంలో తను పడిన బాధలను పంచుకుంది. చిన్నప్పట్నుంచి తనను ప్రతి ఒక్కరూ ఏదో విషయంలో జడ్జ్ చేస్తూనే ఉన్నారని, సొసైటీలో అందరికీ ఇలాంటి అనుభవాలుంటాయంది.
పెళ్లైన కొత్తలో తను బాడీ షేమింగ్ కామెంట్లు ఎదుర్కొన్నట్లు, తన అందం గురించి, బాడీ గురించి చాలా అన్నారని ఆమె చెప్పారు. అంతే కాదు చరణ్ తనను పెళ్లి చేసుకుంది కూడా తన వెనుక ఉన్న డబ్బు కోసమని కామెంట్ చేశారన్నారు. కానీ అలాంటి విమర్శలు చేసిన వాళ్లను ఉపాసన ఏమీ అనాలనుకోకపోవడం ఆమె వ్యక్తిత్వానికి నిదర్శనం.
అంతే కాదు, ఉపాసన ఈ విషయంలో మరింత క్లారిటీ కూడా ఇచ్చింది. అసలు కామెంట్స్ చేసిన ఎవరికీ తమ గురించి తెలియదని, తామిద్దరం కామన్ ఫ్రెండ్స్ ద్వారా కలిసినట్లు, భిన్న కుటుంబాల నుంచి వచ్చినప్పటికీ వారిద్దరూ ఒకరి నుంచి ఒకరు చాలా నేర్చుకుంటూ జీవితంలో పైకి ఎదిగినట్లు చెప్పింది. పెళ్లైన కొత్తలో తన గురించి ఏదేదో అన్న వాళ్లే ఈ పదేళ్లలో తనని అర్థం చేసుకున్నారని, ఇప్పుడు తనపై వారందరి ఒపినీయన్ మారిందని ఉపాసన చెప్పుకొచ్చింది. తనపై ట్రోల్స్ వచ్చినప్పుడు ఎప్పుడూ తను కృంగిపోలేదని, వాటిని ఎదుర్కొంటూ వచ్చినట్లు, అందుకే ఇప్పుడు తానొక ఛాంపియన్ లాగా ఫీలవుతుంటానని ఉపాసన ఆ ఇంటర్వ్యూలో పేర్కొంది.













