Shruthi Hassan: సింగిల్ పేరెంట్ గా ఉండాలనుకోవడం లేదు

కమల్ హాసన్(Kamal Hassan) కూతురిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టినప్పటికీ తర్వాత పలు భాషల్లో సినిమాలు చేసి తనకంటూ సొంత గుర్తింపు తెచ్చుకుంది శృతి హాసన్(Shruthi Hassan). ప్రస్తుతం రజినీకాంత్(rajinikanth)- లోకేష్ కనగరాజ్(Lokesh Kanagaraj) కాంబినేషన్ లో తెరకెక్కిన కూలీ సినిమాలో శృతి హీరోయిన్ గా నటించారు. కూలీ ఆగస్ట్ 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన శృతి తన ప్రేమ, పర్సనల్ లైఫ్ గురించి కీలక వ్యాఖ్యలు చేసింది.
ఇప్పటికే శృతికి రెండు బ్రేకప్స్ జరిగాయి. మొదట్లో మైఖేల్ కోర్సెల్(Michael Corsale) తో ప్రేమలో ఉన్న శృతి, మనస్పర్థల కారణంగా వారిద్దరూ విడిపోయారు. ఆ తర్వాత శాంతను హజారిక(Santhanu Hazarika)తో మూడేళ్ల పాటూ రిలేషన్ లో ఉన్న శృతి అతన్నుంచి కూడా విడిపోయింది. వీరిద్దరి ప్రేమ పెళ్లి వరకు వెళ్లలేకపోయింది. పెళ్లి అనుకున్నంత ఈజీ కాదని, ఇద్దరి మధ్య బాధ్యతలు, అండర్‌స్టాండింగ్ చాలా ముఖ్యమని చెప్పింది శృతి.
పెళ్లిని, ఆ సాంప్రదాయన్ని తానెంతో గౌరవిస్తానని, కానీ లైఫ్ లో పెళ్లి తప్పనిసరినా కాదా అనే విషయంలో సందిగ్ధంలో ఉన్నానని చెప్పిన శృతి అదే ఇంటర్వ్యూలో మాతృత్వం గురించి కూడా మాట్లాడింది. ఏదొక రోజు పేరెంట్స్ అవాలని కోరుకుంటున్న తాను ఒకవేళ పెళ్లి చేసుకోకపోతే దత్తత తీసుకుంటానని, అలా అని సింగిల్ పేరెంట్ గా పిల్లల్ని పెంచాలనుకోవడం లేదని, అలా పెంచాల్సి వస్తే ఎన్ని ఇబ్బందలు, కష్టాలు పడాలో తనకు తెలుసని, తాను అలాంటి ఫ్యామిలీలోనే పెరిగానని, అన్నీ తెలిసి కూడా మళ్లీ అలాంటి బాధలను లైఫ్ లోకి తెచ్చుకోనని శృతి తెలిపింది.