Vijay Devarakonda: ఎలాంటి సినిమాలు వర్కవుట్ అవుతున్నాయో అర్థం కావట్లేదు
టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ(Vijay Devarakonda) నటించిన తాజా సినిమా కింగ్డమ్(Kingdom). గౌతమ్ తిన్ననూరి(Gowtham Thinnanuri) దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా జులై 31న ప్రేక్షకుల ముందుకు రానుంది. మేకర్స్ కింగ్డమ్ ప్రమోషన్స్ ను చాలా గ్రాండ్ గా చేస్తున్నారు. అందులో భాగంగానే ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించగా, అందులో విజయ్ మాట్లాడిన మాటలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
విజయ్ తన స్పీచ్‌లో మారుతున్న సినిమాల పరిస్థితితో పాటూ ప్రేక్షకులతో తనకున్న బాండింగ్ ను, మరికొన్ని విషయాలను పంచుకున్నాడు. ఇప్పుడు బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సినిమాలు వర్కవుట్ అవుతున్నాయో తనకు అర్థం కావడం లేదని విజయ్ ఈ సందర్భంగా అన్నాడు. ఆడియన్స్ కు తాను సినిమాలతోనే పరిచయమయ్యానని, ఇప్పటివరకు తాను వర్క్ చేసిన ప్రతీ సినిమాకూ తన వంతు న్యాయం చేశానని విజయ్ చెప్పాడు.
తనకు ఓపిక ఉన్నంత వరకు ఎప్పుడూ ఏదొకటి చేసి ఆడియన్స్ ను అలరిస్తూనే ఉంటానని చెప్పిన విజయ్, ఒకప్పటితో పోలిస్తే చాలానే మారాడు. ఒకప్పుడు స్టేజ్ ఎక్కితే ఎంతో అగ్రెస్సివ్ గా మాట్లాడే విజయ్ ఇప్పుడు చాలా మెచ్యూర్డ్ గా మాట్లాడటం అందరినీ ఆశ్చర్యపరుస్తుంది. కింగ్డమ్ సినిమా విషయంలో చాలా కాన్ఫిడెంట్ గా ఉన్న విజయ్ మరి ఆ సినిమాతో ఎలాంటి ఫలితాన్ని అందుకుంటాడో చూడాలి.







