భరతమాత కోసం తాను చనిపోవడానికి సిద్ధం
ఇండియా, పాకిస్థాన్ మధ్య యుద్దం జరిగితే, తాను ప్రాణత్యాగానికి సిద్ధమని బాలీవుడ్ నటి రాఖీ సావంత్ చెబుతోంది. పంజాబ్‌లోని లూధియానాలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన అమె మీడియాతో మాట్లాడుతూ భారత మాత కోసం తాను చనిపోవడానికి సిద్ధ మని చెప్పింది. తనకు 50 నుంచి 100 బాంబలు ఇస్తే, శత్రు శిబిరాల్లోకి దూసుకెళ్లి, వారిని మట్టుబెట్టి వస్తానని చెప్పింది. పుల్వామాలో ఆర్మీ కాన్యాయ్‌పై జరిగిన ఉగ్ర దాడి తరువాత ప్రధాని నరేంద్ర మోదీ సరైన చర్యలు తీసుకున్నారని అభిప్రాయపడింది. తాను కేంద్ర చర్యలను సమర్థిస్తున్నానని, పాకిస్థాన్‌కు సరైన సమాధానాన్నే ఇచ్చామని చెప్పింది.













