అతన్ని పెళ్లాడడం నా అదృష్టం
తాను ప్రపంచంలోనే గొప్ప వ్యక్తిని పెళ్లి చేసుకున్నానని అంటున్నారు బాలీవుడ్ బ్యూటీ అనుష్క శర్మ. ఆమె కథానాయికగా నటించిన చిత్రం సుయీ ధాగా. వరుణ్ ధావన్ కథానాయకుడు. శరత్ కటారియా ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఈ సినిమా ప్రచార కార్యక్రమంలో భాగంగా అనుష్క, విరాట్ ఓ ఆంగ్ల మీడియా నిర్వహించిన ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా విలేకరి అనుష్కను ప్రశ్నిస్తూ, మీరు ప్రపంచంలోనే గొప్ప బ్యాట్‌మెన్‌ను పెళ్లి చేసుకున్నారు కదా? అన్నాడు. ఇందుకు అనుష్క్ సిగ్గుపడుతూ, నేను ప్రపంచంలోనే గొప్ప వ్యక్తిని పెళ్లి చేసుకున్నాను అన్నారు.
తన భర్త గురించి మరిన్ని విషయాలను పంచుకుంటూ, మమ్మల్ని పవర్ కపుల్ అని సంబోధిస్తుంటారు. కానీ ఆ పదానికి మేం అంతగా ఎటాచ్ అవ్వలేదు. మా వ్యూ ఎత్తుల కంటే ముందు సాధారణ భార్యభర్తలుగా జీవించాలని అనుకుంటాం. మాకు స్టార్డం, పావులారిటీపై అంత వ్యామోహం లేదు. ఒక్కోసారి వీటన్నింటి నుంచి పారిపోవాలని అనిపిస్తుంది. మా కంటూ వ్యక్తిగతంగా సమయం కావాలి అనిపిస్తుంది. నాలో విరాట్, విరాట్‌లో నేను ఉన్నాం. ఇతరులకు మాపై భిన్నాభిప్రాయాలు ఉంటాయి కానీ ఒకరికొకరు ఇచ్చుకునే విలువలు మా త్రం ఒక్కటే. వృత్తి పరంగా మా డ్యూటీని ముగించుకుని తిరిగి మా సింపుల్ జీవితాలు గడుపుతాం అని వెల్లడించారు అనుష్క.













