మెగా ఈవెంట్ కి స్పెషల్ ట్రైన్…
మెగాస్టార్ చిరంజీవి సినిమా నుండి ఎలాంటి అప్డేట్ వచ్చినా ఫాన్స్ కి పండగే. చిరు నటించిన భారీ బడ్జెట్ సినిమాలల్లో వాల్తేరు వీరయ్య ఒకటి. 2024 జనవరి సంక్రాంతి కానుకగా ఈ సినిమా రాబోతుందన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాపై అభిమానుల అంచనాలు ఏ రేంజ్ లో ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ సినిమాలో మాస్ మహారాజా రవితేజ కూడా ఒక స్పెషల్ పాత్రలో కనిపిస్తుండడం విశేషం.
ఈ సినిమాకి సంబంధించి రీసెంట్ గా రిలీజైన టీజర్ కూడా ప్రేక్షకుల్లో పాజిటివ్ టాక్ ని సంపాదించింది. ఇక సాంగ్స్ కూడా అందరిని ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. ఈ క్రమంలో చిత్ర యూనిట్ సభ్యులు ప్రత్యేకంగా ప్రమోషన్స్ పెంచాలని చూస్తోంది. ఈ సందర్భంగా సినిమాకు సంబంధించిన ఈవెంట్ ని నిర్మాణ సంస్థ ప్లాన్ చేసింది. అయితే ఈ ఈవెంట్ ని ఎక్కడ నిర్వహిస్తారు అని మెగా ఫాన్స్ ఆలోచనల్లో ఉన్నారు.
ఈవెంట్ విషయంలో అభిమానుల్లో కొనసాగుతున్న కన్ఫ్యూజన్ కు మొత్తానికి ఒక క్లారిటీ వచ్చినట్లుగా తెలుస్తోంది. వాల్తేరు వీరయ్య సినిమా ఈవెంట్ ను వైజాగ్ లో నిర్వహించాలని అనుకుంటున్నారు. సినిమా బ్యాక్ డ్రాప్ కూడా వైజాగ్ అవ్వడంతో, ఈవెంట్ ని కూడా అక్కడ ప్లాన్ చేస్తేనే బాగుంటుందని అనుకుంటున్నారట.
అసలు విషయం ఏంటంటే, హైదరాబాద్ నుండి వైజాగ్ ఈవెంట్ కి రావడానికి మెగా ఫాన్స్ కి ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారట. అభిమానుల కోసం స్పెషల్ ట్రైన్ ని ఏర్పాటు చేస్తున్నట్టు సమాచారం. విశాఖలో గ్రాండ్ గా ఈవెంట్ ని నిర్వహించి ఈ సినిమాని ప్రమోషన్స్ తో వేరే లెవెల్ కి తీసుకెళ్లాలని మైత్రి మూవీ మేకర్స్ గట్టిగానే డిసైడ్ అయ్యింది.
ఈ ఈవెంట్ కి ముఖ్య అతిధిగా ప్రముఖ హీరో ని ఇన్వైట్ చేస్తున్నారట. ఇప్పటివరకైతే ఆ అతిథి ఎవరు అనే క్లారిటీ లేదు. ఈ విషయంలో కూడా చాలా ఊహాగానాలే వినిపిస్తున్నాయి. చాలారోజుల తర్వాత చిరంజీవి భారీ బడ్జెట్ సినిమా వస్తుండడం, ఇందులో మాస్ మహారాజ్ కూడా కనిపిస్తుండడంతో ఇటు మెగా ఫాన్స్, అటు మాస్ ఫాన్స్ ఈ చిత్రం కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇక ఈ సంక్రాంతి బరిలో మన వాల్తేరు వీరయ్య ఎంత కలెక్షన్ల వర్షం కురిపిస్తాడో వేచి చూడాల్సిందే.













