50 రోజులు పూర్తి చేసుకున్న హుషారు
బెక్కెం వేణుగోపాల్, రియాజ్ నిర్మాతలుగా రూపొందిన చిత్రం హుషారు. శ్రీహర్ష కొనుగంటి దర్శకత్వంలో తేజస్ కంచర్ల, తేజ్ కూరపాటి, అభివన్ మంచు, దినేష్ తేజ, దక్షనగార్కర్, ప్రియా వడ్లమాని, హేమ ఇంగ్లే ప్రధాన తారాగణంగా రూపొందిన ఈ సినిమా డిసెంబర్ 14న విడుదలై 50 రోజులను పూర్తిచేసుకుంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లోని ప్రసాద్‌ల్యాబ్‌లో 50 డేస్ ఫంక్షన్ నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్మాత బెక్కం వేణుగోపాల్ మాట్లాడుతూ సినిమా ఇంత పెద్ద విజయాన్ని సాధిస్తుందని నేను ఊహించలేదు. ఈ సినిమా కోసం అందరం ఏడాదిన్నర పాటు కష్టపడ్డాం. నాకు పెద్ద హిట్‌ను ఇచ్చిన చిత్రమిది అని అన్నారు.
దిల్‌రాజు మాట్లాడుతూ ఫస్ట్ సాంగ్ రిలీజ్ రోజునే సినిమా బాగుందని చెప్పాను. నిజంగానే సినిమాను ప్రేక్షకులు ఆదరించారు. ఈరోజుల్లో సినిమా అడేదే కష్టం. అలాంటిది 50 రోజులు పూర్తి చేసుకోవడం అంటే అసాధారణ విషయం. చిత్ర బృందానికి అభినందనలు అని తెలిపారు. శ్రీహర్ష కొనుగంటి మాట్లాడుతూ ప్రేక్షకులు ఈ సినిమాను ఎంతగానో ఆదరించారు. ఈ చిత్రం విజయం నాకెంతో ఆనందాన్నిచ్చింది అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో తేజ్ కొర్రపాటి, దినేష్, తేజస్ కంచర్ల, ప్రియ వడ్లమాని తదితరులు పాల్గొన్నారు.













