దానికి వయసుతో సంబంధం లేదు ఎవరైనా చేయొచ్చు
స్నేహానికి వయసుతో సంబంధం లేదంటోంది హుషారు చిత్ర నాయిక హేమల్ ఇంగ్లే. మోడల్‌గా రాణించిన ఈ భామ హుషారు చిత్రంతో తెలుగు తెరకొస్తోంది. ఈ చిత్రంలో తేజస్, తేజ్, దినేష్, అభినవ్, దక్ష, ప్రియా వడ్లమాని, రాహుల్ రామకృష్ణ ఇతర పాత్రల్లో నటించారు. లక్కీ మీడియా సంస్థ నిర్మాణంలో దర్శకుడు శ్రీహర్ష హుషారు సినిమాను తెరకెక్కించారు. త్వరలో విడుదలకు సిద్ధమవుతున్న హుషారు చిత్ర విశేషాలను హేమా ఇంగ్లే తెలిపింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మాది మహారాష్ట్రలోని కోలాపూర్. చదువుతో పాటు మోడలింగ్‌లో ఆసక్తి ఉండేది. అలా యూనివర్సిటీ అందాల పోటీల్లో గెలిచాను. అలా మోడలింగ్‌లో పేరొచ్చాక సినిమాల్లో అవకాశాలు వచ్చాయి. హుషారు తెలుగులో నాకు తొలి చిత్రం. మంచి పాత్రలో నటించాను. సినిమాలో ముంబై నుంచి వచ్చిన సౌమ్య అనే అమ్మాయి పాత్రలో కనిపిస్తాను. వృత్తిపరంగా స్థిరపడాలని కోరుకునే యువతిగా నటించాను. నాది అల్లరి పిల్లలాంటి పాత్ర. ఐదు పాటల్లో నేను రెండింటిలో ఉంటాను. ఈ చిత్రంలో నలుగురు స్నేహితుల జంటలుంటాయి. స్నేహానికి వయసుతో సంబంధం లేదు. ఎవరైనా చేయొచ్చు.. ప్రతి ఒక్కరికీ నచ్చే సినిమా అవుతుంది అని చెప్పింది.













