మెగాస్టార్ సరసన ఖురేషి!
హ్యూమా ఖురేషి బాలీవుడ్లో గ్యాంగ్స్ ఆఫ్ వన్సీపూర్ 2 సహా మంచి మంచి సినిమాల్లో నటించింది. ఇటీవలే సూపర్‌స్టార్ రజనీకాంత్ కాలా చిత్రంలో దక్షిణాదిన అడుగుపెట్టింది. హ్యూమా నటన అద్భుతంగా ఉందని ప్రశంసలు కూడా వచ్చాయి. దీని తర్వాత హ్యూమా సౌత్‌లో మరోభారీ చిత్రంలో నటించబోతోందనే వార్తలొస్తున్నాయి. మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెలుగులో తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక చిత్రం సైరా నరసింహారెడ్డిలో హ్యూమా ఓ కీలకపాత్రలో నటించనున్నట్లు తెలుస్తోంది. ఇటీవలే ఆమెకు ఆ పాత్ర గురించి చెప్పి ఒప్పించారని అంటున్నారు. కాగా సైరాలో ప్రధాన నాయికగా నయనతార నటిస్తోంది. తమన్నా కూడా ఇందులో ఓ కీలకపాత్ర పోషించనున్నారు.













