బాలీవుడ్ నిర్మాత రాజ్‌కుమార్ భర్జాత్యా ఇక లేరు
ప్రముఖ బాలీవుడ్ నిర్మాత రాజ్‌కుమార్ భర్జాత్యా ముంబయిలో కన్నుమూశారు. గత కొంత కాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. రాజశ్రీ ఫిలింస్ పతాకంపై ఆయన ఎన్నో విజయవంతమైన చిత్రాల్ని నిర్మించారు. కుటుంబ విలువల కలబోతగా చక్కటి ప్రేమకథా చిత్రాల్ని అందించి అభిరుచిగల నిర్మాతగా పేరు తెచ్చుకున్నారు. సల్మాన్ ఖాన్ కథానాయకుడిగా మైనే ప్యార్‌కియా, హమ్ సాథ్సాథ్ హై, ప్రేమ్ రతన్ దన్పాయే, వంటి సిమాల్ని తెరకెక్కించారు. ఆయన నిర్మించిన హమ్ చార్ చిత్రం ఇటీవలే విడుదలైంది. రాజ్‌కుమార్ భర్జాత్యా మృతిపట్ల పలువురు బాలీవుడ్ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు.













