పల్లెటూరి సెట్లో మహర్షి
సిటీ ఎంత సొగసుగా అనిపించినా, పల్లెటూరిలో ఉండే ఆనందానికి సాటి రాదన్నది ఎక్కువ శాతం మంది అంగీకరించే మాట. తాజాగా హీరోలు మహేశ్, అల్లరి నరేశ్ కూడా పల్లెటూరి వాతావరణాన్ని ఆస్వాదిస్తున్నారు. మహర్షి సినిమా కోసం వేసిన పల్లెటూరి సెట్లో. వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తున్న చిత్రం మహర్షి. దిల్ రాజు, అశ్వినీదత్, పీవీపీ నిర్మాతలు. మహేష్, పూజా హెగ్డే జంటగా నటిస్తున్న ఈ చిత్రంలో అల్లరి నరేశ్ కీలక పాత్ర పోషిస్తున్నారు. రామోజీ ఫిల్మ్‌సిటీలో మొదలైన షెడ్యూల్ నెలరోజుల పాటు సాగుతుంది. అక్కడ మహేశ్, అల్లరి నరేశ్ మధ్య కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నారు. వేసవి కానుకగా ఈ సినిమా ఏప్రిల్‌లో విడుదల కానున్న విషయం తెలిసిందే.













