రాజాసాబ్ ట్విస్టులతో మతి పోగోట్టేలా ఉన్నాడే!
కల్కి(Kalki) బ్లాక్ బస్టర్ తర్వాత పాన్ ఇండియా స్టార్ ప్రభాస్(Prabhas) హీరోగా మారుతి(Maruthi) దర్శకత్వంలో ది రాజా సాబ్(The raja saab) సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. వచ్చే ఏడాది ఏప్రిల్ 10న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమాపై రీసెంట్ గా వదిలిన ప్రభాస్ లుక్ చూసి అంచనాలు బాగా పెరిగాయి. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ(People media factory) భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ సినిమా హార్రర్ జానర్ కావడంతో నార్త్ లో కూడా రాజా సాబ్ బిజినెస్ భారీగా జరగడం ఖాయమనిపిస్తోంది.
ఇదిలా ఉంటే రాజా సాబ్ సినిమాలో చంద్రముఖి(Chandramukhi)లా ఓ ఫార్ములా ఉంటుందని ఇన్సైడ్ టాక్. తాత పాత్ర పోషిస్తున్న సంజయ్ దత్(Sanjay Dutt), ప్రభాస్ మధ్య జరిగే సీన్స్ ఫ్లాష్ బ్యాక్ లో రాజా సాబ్ ఎపిసోడ్ కు దారి తీస్తాయని ఆ మ్యానరిజం, హీరోయిజం చంద్రముఖిలో రజినీకాంత్(Rajinikanth) లకలకని మించి ఉంటాయని, మారుతి దాన్ని చాలా బాగా డిజైన్ చేశాడని అంటున్నారు.
రీసెంట్ గా రిలీజ్ చేసిన పోస్టర్ లోని తెల్లజుట్టు ఉన్న పాత్రే అసలైన రాజా సాబ్ అని, మరో యంగ్ లుక్ ప్రభాస్ డ్యూయల్ రోల్ తో సెకండాఫ్ లో షాక్ ఇస్తాడని అంటున్నారు. ఇవన్నీ నిజమైతే మాత్రం రాజా సాబ్ లోని ట్విస్టులకు ఫ్యాన్స్ పిచ్చోళ్లైపోవడం ఖాయం. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఫిబ్రవరికి సినిమాను పూర్తి చేసి ఫస్ట్ కాపీ రెడీ చేయాలని టీమ్ టార్గెట్ పెట్టుకుంది. నిధి అగర్వాల్Niddhi Agarwal), మాళవికా మోహనన్(Malavika Mohanan) హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాకు తమన్ సంగీతం అందిస్తున్నాడు.













