మూడు నెలలుగా సికిందర్ కోసం సెట్ నిర్మాణం
బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ హీరోగా మురుగదాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ యాక్షన్ ఎంటర్టైనర్ సికిందర్. ప్రస్తుతం రెగ్యులర్ షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమాను మురుగదాస్ తన మార్క్ యూనిక్ పాయింట్ తో రూపొందిస్తున్నాడు. కథలో ఎమోషన్స్ ను హైలైట్ చేస్తూనే తన మార్క్ మెసేజ్ ఉండేలా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడట మురుగదాస్.
ఇదిలా ఉంటే ఈ సినిమా కోసం ముంబైలో ఓ భారీ సెట్ ను నిర్మిస్తున్నారట. ఈ సెట్ ను ఎంతో మంది కలిసి మూడు నెలలుగా నిర్మిస్తున్నారట. సికిందర్ షూటింగ్ దాదాపు 45 రోజుల పాటూ ఈ సెట్ లోనే జరగనుందని సమాచారం. అంతేకాదు ఈ సెట్ లో జరిగే షూటింగ్ వరకు ఓ స్పెషల్ షెడ్యూల్ గా భావించి షూట్ కు వెళ్లనుందట సికిందర్ టీమ్.
ఇప్పటివరకు మురుగుదాస్ ఇంత భారీ సెట్ లో షూటింగ్ చేసింది లేదు. మహా అయితే పాటల కోసం సెట్స్ వాడుకుంటారు తప్పించి మిగిలినదంతా అవుట్డోర్ లో చేయడానికే ఆయన ప్రాధాన్యత ఇస్తారు. కానీ సికిందర్ విషయంలో ఏకంగా 45 రోజుల పాటూ సెట్ లోనే షూటింగ్ అంటే సినిమాలో దీని ప్రాముఖ్యత చాలానే ఉండనున్నట్లు అర్థమవుతుంది. ఈ సినిమాలో సల్మాన్ ఖాన్ కు జోడీగా రష్మిక మందన్నా నటిస్తున్న విషయం తెలిసిందే.













