Anirudh Ravichander: అనిరుధ్ ను తట్టుకోవడం అందరి వల్లా అయ్యేలా లేదే!
అనిరుధ్ రవిచందర్(Anirudh Ravichander) ప్రస్తుతం తెలుగు, తమిళ భాషల్లోనే కాకుండా పాన్ ఇండియా లెవెల్ లో క్రేజ్ దక్కించుకున్నాడు. సౌత్ సినిమాలతో పాటూ నార్త్ లో కూడా సినిమాలు చేస్తూ బిజీ అయిన అనిరుధ్ ప్రస్తుతం ఇండియన్ మ్యూజిక్ డైరెక్టర్లలో నెం.1 ప్లేస్ లో ఉన్నాడు. సినిమా ఎలా ఉన్నా దాన్ని అనిరుధ్ తన మ్యూజిక్ తో నెక్ట్స్ లెవెల్ కు తీసుకెళ్తాడనే పేరు సంపాదించాడు.
టాలీవుడ్ లో అనిరుధ్ కు చాలా ఎక్కువ క్రేజ్ ఉంది. ప్రతీ హీరో ఫ్యాన్ తమ హీరో కూఆ ఒక్కసారైనా అనిరుధ్ తో సినిమా చేయాలనుకుంటున్నారు. ఆ రేంజ్ లో అనిరుధ్ పాపులరయ్యాడు. గతేడాది అనిరుధ్ నుంచి వచ్చిన దేవర సినిమా ఏ రేంజ్ లో హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పే పన్లేదు. దేవర(devara) సక్సెస్ లో అనిరుధ్ పాత్ర చాలా కీలకం.
అయితే అనిరుధ్ తో పని చేయాలని అందరికీ ఉన్నా ఆయన్ను అందుకోవడం అందరి వల్లా అయ్యే పని కాదు. అనిరుధ్ రెమ్యూనరేషన్ తో చిన్న బడ్జెట్ సినిమాలు మొత్తం పూర్తైపోతాయి కూడా. ఆ రేంజ్ లో ఈ సౌత్ సెన్సేషన్ ఛార్జ్ చేస్తున్నాడు. ఒకప్పుడు ఇండియాలో ఎక్కువ రెమ్యూనరేషన్ తీసుకునే మ్యూజిక్ డైరెక్టర్ రెహమాన్(Rahman) ఉంటే ఇప్పుడు అనిరుధ్ ఆయన్ని దాటేశాడంటున్నారు.
నాని(Nani) హీరోగా శ్రీకాంత్ ఓదెల(Srikanth Odela) దర్శకత్వంలో తెరకెక్కనున్న సినిమాకు అనిరుధ్ ఏకంగా రూ.14 కోట్లు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నాడని టాక్ వినిపిస్తోంది. దేవరకు రూ.10 నుంచి రూ.12 కోట్లు తీసుకున్న అనిరుధ్ ఇప్పుడు ఒకేసారి రూ.2 కోట్లు పెంచాడట. నిర్మాతలు కూడా అనిరుధ్ కు ఈ భారీ మొత్తం ఇవ్వడానికి ఆసక్తిగానే ఉన్నట్టు తెలుస్తోంది.













