MSG: మెగాస్టార్ మూవీకి భారీ ఓవర్సీస్ డీల్
టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న లేటెస్ట్ మూవీ మన శంకరవరప్రసాద్ గారు(Mana Shankaravaraprasad Garu). హిట్ మిషన్ అనిల్ రావిపూడి(Anil Ravipudi) దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అవుతుంది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ తో పాటూ ప్రమోషన్స్ ను కూడా చేసుకుంటుంది.
చిరంజీవి(Chiranjeevi), అనిల్(Anil) కాంబినేషన్ లో వస్తున్న మొదటి సినిమా కావడంతో మన శంకరవరప్రసాద్ గారుపై ముందు నుంచి భారీ అంచనాలున్నాయి. ఈ నేపథ్యంలోనే సినిమాకు మంచి బిజినెస్ కూడా జరుగుతుంది. అందులో భాగంగానే మన శంకరవరప్రసాద్ గారు మూవీకి రికార్డు రేటులో ప్రీ రిలీజ్ బిజినెస్ జరుగుతున్నట్టు తెలుస్తోంది. ఏకంగా రూ.20 కోట్ల మేర ఈ మూవీకి ఓవర్సీస్ డీల్ జరిగిందని ఇన్సైడ్ టాక్.
అంటే నార్త్ అమెరికాలో ఈ మూవీ బ్రేక్ ఈవెన్ అవాలంటే 3.5 మిలియన్ డాలర్లు కలెక్ట్ చేయాల్సిన అవసరముంది. మొత్తమ్మీద ఓవర్సీస్ లో మన శంకరవరప్రసాద్ గారు బ్రేక్ ఈవెన్ కావాలంటే 4.75 మిలియన్ డాలర్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ అవుతుంది. కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమాలో నయనతార(Nayanathara) హీరోయిన్ గా నటిస్తుండగా, విక్టరీ వెంకటేష్(Venkatesh) కీలక పాత్రలో కనిపించనున్నారు.






