విజయ్ సినిమాకు నెక్ట్స్ లెవెల్ క్రేజ్
వెంకట్ ప్రభు దర్శకత్వంలో ఇళయదళపతి విజయ్ హీరోగా తెరకెక్కుతున్న సినిమా గోట్. రూ.200 కోట్ల భారీ బడ్జెట్ తో రూపొందుతున్న ఈ సినిమాపై తమిళనాట ఫుల్ క్రేజ్ ఉంది. యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్న ఈ సినిమా నుంచి రీసెంట్ గానే ఫస్ట్ సాంగ్ రిలీజై మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. ఇదిలా ఉంటే విజయ్ ఇప్పటికే రాజకీయాల్లో బిజీ అయ్యేందుకు రెడీ అయ్యాడు.
ఇప్పటికే పార్టీ పేరు అనౌన్స్ చేసిన విజయ్, రాజకీయాల్లోకి పూర్తిగా వెళ్లాక సినిమాలు వదిలేస్తానని చెప్పాడు. గోట్ తర్వాత మరో సినిమా మాత్రమే చేస్తానని విజయ్ క్లారిటీగాచెప్పాడు. అందుకే ప్రస్తుతం చేస్తున్న గోట్ సినిమాపై భారీ అంచనాలున్నాయి. ఆ క్రేజ్ కు తగ్గట్టే సినిమాకు బిజినెస్ జరుగుతుంది. ఇప్పటికే డిజిటల్ రైట్స్ రూ.150 కోట్లకు అమ్ముడైనట్లు తెలుస్తోంది.
ఇప్పుడు ఈ సినిమా శాటిలైట్ రైట్స్ బిజినెస్ కూడా షాకిచ్చేలా ఉందని చెప్పొచ్చు. ఈ సినిమా శాటిలైట్ రైట్స్ ను జీ నెట్వర్క్ ఏకంగా రూ.90 కోట్లకు కొనుగోలు చేసినట్లు సమాచారం. జీ నెట్వర్క్ ఈ మధ్య కాలంలో ఇంత ఎక్కువ పెట్టుబడి పెట్టిన సినిమా ఇదేనని తెలుస్తోంది. ఈ సినిమాకు సంబంధించిన అన్ని భాషల రైట్స్ కోసం ఈ మొత్తాన్ని చెల్లించడానికి జీ నెట్వర్క్ రెడీ అయిందట. మొత్తానికి ఈ సినిమాను నిర్మాతలు టేబుల్ ప్రాఫిట్ తోనే రిలీజ్ చేయనున్నారని అయితే అర్థమవుతుంది.













