సలార్ హక్కులకు భారీ డిమాండ్
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో వస్తున్న సినిమా యాక్షన్ థ్రిల్లర్ సలార్. శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాను హోంబలే ఫిల్మ్స్ సంస్థ ఎంతో భారీగా నిర్మిస్తుంది. సలార్ నుంచి ఇప్పటి వరకు రిలీజ్ అయింది పోస్టర్లు. ఓ చిన్న టీజర్ మాత్రమే. ఆ కంటెంట్ కే ఆడియన్స్ ఈ సినిమాపై భారీ అంచనాలు పెట్టుకున్నారు.
సలార్ సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి సుమారు 175 కోట్ల బిజినెస్ చేసిందనే వార్త ఇప్పుడు అభిమానుల్లో పెద్ద చర్చలకు దారి తీస్తోంది. ఇంత మొత్తం కలెక్షన్స్ మళ్లీ వసూలు కావాలంటే దాదాపు రూ.300 కోట్ల గ్రాస్ ను సినిమా వసూలు చేయగలగాలి. సలార్ కు ఉన్న బజ్, హైప్ దృష్ట్యా ఇదేం పెద్ద కష్టం కాదు.
సినిమాలో కాస్త కంటెంట్ ఉంటే ఈ టార్గెట్ ను సలార్ చాలా ఈజీగా దాటేయగలదు. అందుకే బయ్యర్లు ఎంత ఎక్కువ రేట్లు పెట్టి అయినా సరే సలార్ రైట్స్ తీసుకోవడానికి వెనుకాడట్లేదు. డిసెంబర్ 22 నుంచి జవనరి 12 వరకు చెప్పుకోదగ్గ పెద్ద సినిమాలేవీ లేకపోవడంతో సలార్ కు మంచి టాక్ వస్తే బ్లాక్ బస్టర్ టాక్తో పాటూ మంచి కలెక్షన్స్ రావడం పక్కా. ఈ సినిమా రిలీజ్ దగ్గర పడుతుండటంతో ఫ్యాన్స్ సలార్ అప్డేట్స్ కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నారు.













