టాలీవుడ్ టాప్ హీరో సినిమాకి అడ్డుపడుతున్న బాలీవుడ్ టాప్ హీరో
టాలీవుడ్ హీరో సినిమాని బాలీవుడ్ హీరో అడ్డుకుంటాడు అనే డౌట్ అందరికీ వస్తుంది. దాని వెనక పెద్ద కథే ఉంది. ప్రస్తుతం ఎన్టీఆర్, రామ్‌చరణ్ హీరోలుగా ఆర్ ఆర్ ఆర్ చిత్రాన్ని ఎంతో భారీగా తెరకెక్కిస్తున్న రాజమౌళి తన తదుపరి సినిమా మహేష్‌తో ఉంటుందని గతంలోనే ప్రకటించాడు. ఈ చిత్రాన్ని దుర్గా ఆర్ట్స్ పతాకంపై డా.కె.ఎల్.నారాయణ నిర్మిస్తారు. సింహాద్రి సినిమా రిలీజ్ అయిన తర్వాత తదుపరి సినిమా చేసేందుకు రాజమౌళికి అడ్వాన్స్ ఇచ్చాడు కెఎల్ నారాయణ. అప్పటి నుంచి ఇప్పటివరకు దుర్గా ఆర్ట్స్ బేనర్లో సినిమా చేయడానికి రాజమౌళికి వీలుపడలేదు. ఇన్నాళ్ళకు ఆ అవకాశం వచ్చింది.
మహేష్ సినిమా కమిట్ అయిన రాజమౌళి దాన్ని దుర్గా ఆర్ట్స్ బేనర్లోనే చె్య్యాలని డిసైడ్ అయ్యాడు. ఆర్ ఆర్ ఆర్ పూర్తయిన తర్వాత, సర్కారువారి పాట పూర్తయిన తర్వాత వీరిద్దరి కాంబినేషన్లో సినిమా స్టార్ట్ చెయ్యాలని అనుకున్నారు. ఇదిలా ఉంటే మహేష్, రాజమౌళి ప్రాజెక్ట్ ఉండదని ప్రచారం జరుగుతోంది. దానికి కారణం బాలీవుడ్ హీరో అమీర్‌ఖాన్ అని చెప్పకుంటున్నారు. ఓ సందర్భంలో అమీర్‌ఖాన్‌తో సినిమా చేస్తానని రాజమౌళి చెప్పాడు. ఇప్పుడు దాన్ని వినియోగించుకోవాలని అనుకుంటున్నాడు అమీర్‌ఖాన్. ఆర్ ఆర్ ఆర్ తర్వాత తనతో సినిమా చెయ్యాలని అమీర్ పట్టుపడుతున్నాడట. దీనిపై అధికారికంగా ఎలాంటి ప్రకటన రానప్పటికీ మహేష్, రాజమౌళి ప్రాజెక్ట్ డిలే అయ్యే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని సినీ వర్గాలు భావిస్తున్నాయి.













