హరీష్ మార్పులను మెచ్చుకోవాల్సిందే
ఏదైనా ఒక సినిమాను రీమేక్ చేసేటప్పుడు దానికి ఎక్కువగా మార్పులు చేయకుండా తీయడానికే ఎవరైనా ఇష్టపడతారు. ఏదైనా మార్పులు చేశాక ఫలితం తేడా కొడితే లేనిపోని నింద మోయాల్సి వస్తుందని ఉన్నది ఉన్నట్లు తీయడానికే డైరెక్టర్లు కూడా ట్రై చేస్తారు. కానీ డైరెక్టర్ హరీష్ శంకర్ మాత్రం దీనికి మినహాయింపు. గబ్బర్ సింగ్, గద్దలకొండ గణేష్ సినిమాలకు ఆయన చేసిన ఛేంజెస్ ఆడియన్స్ కు బాగా నచ్చాయి.
ఆ మార్పుల వల్లే బాక్సాఫీస్ వద్ద వసూళ్లు కూడా బాగా పెరిగాయి. గబ్బర్ సింగ్ చూశాక దబాంగ్ చూస్తే గబ్బర్ సింగ్ సినిమానే చాలా బావుంటుందనిపిస్తుంది. ఇక ఇప్పుడు హరీష్ శంకర్ మిస్టర్ బచ్చన్ అనే మరో రీమేక్ తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. అజయ్ దేవగణ్ రైడ్ సినిమా చూసిన వాళ్లకు మిస్టర్ బచ్చన్ ప్రోమోలు, కంటెంట్ చూస్తుంటే చాలా డౌట్స్ వస్తున్నాయి.
ఈ సినిమాలో లవ్ ట్రాక్, సాంగ్స్ ఎక్స్ట్రా గా యాడ్ అయ్యాయి. విలన్ గా జగపతి బాబుని తీసుకోవడం వల్ల రవితేజ హీరోయిజం ఇంకాస్త ఎక్కువ ఎలివేట్ అయ్యే ఛాన్స్ దొరికింది. మ్యూజిక్ కు ప్రాధాన్యత లేని సినిమాలో ఇప్పుడు మిక్కీ జే మేయర్ సాంగ్స్ జాయిన్ అయ్యాయి. రైడ్ ను రీమేక్ చేస్తున్నారని మొదట్లో అన్నప్పుడు రవితేజ ఇమేజ్ కు ఇలాంటి కథ ఏ మాత్రం సూటవుతుందో అనుకున్నారు కానీ ఆ కథను హరీష్ మార్చిన విధానం చూసి ఇప్పుడందరూ మెచ్చుకుంటున్నారు. గత మూడు సినిమాలుగా ఫ్లాపుల్లో ఉన్న రవితేజకు ఈ సినిమా విజయం ఎంతో కీలకం కానుంది.













