‘హౌస్ అరెస్ట్’ ప్రీ రిలీజ్ వేడుక
శ్రీనివాసరెడ్డి, సప్తగిరి, అదుర్స్ రఘు ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం హౌస్ అరెస్ట్. హైదరాబాద్‌లో ఈ చిత్ర ప్రీ రిలీజ్ వేడుక జరిగింది. దర్శకులు ఎన్.శంకర్, ప్రశాంత్ వర్మ, చంద్రమహేష్ సంయుక్తంగా బిగ్ టికెట్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు మాట్లాడుతూ ఒక రోజు రాత్రిలో జరిగే కథ ఇది. తమ ఇంటిని దోచుకోవడానికి వచ్చిన దొంగలను కొందరు చిన్నారులు ఎలా అడ్డుకున్నారనేది నవ్విస్తూనే ఉత్కంఠను పంచుతుంది. తెలుగులో చక్కటి బాలల సినిమా వచ్చి పదిహేనేళ్లు అవుతున్నది. ఆ లోటు భర్తీ చేసే సినిమా ఇది అని తెలిపారు. శేఖర్ రెడ్డి ఎర్రా దర్శకుడు. ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ పతాకంపై కె.నిరంజన్ రెడ్డి నిర్మిస్తున్నారు. ఈ నెల 27న విడుదల కానుంది.













