హనీ ట్రాప్ రిలీజ్ కు రెడీ
రిషి, శిల్ప నాయక్, తేజు అనుపోజు, శివ కార్తీక్ ప్రధాన పాత్రల్లో పి. సునీల్ కుమార్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం హనీ ట్రాప్. ఈ చిత్రాన్ని ఈ నెల 17న విడుదల చేయనున్నారు. భరద్వాజ్ సినీ క్రియేషన్స్ పతాకంపై వివి వామన రావు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. వివి వామనరావు ఈ చిత్రానికి నిర్మాతగానే కాకుండా కథా స్క్రీన్ ప్లే అందించి ఓ కీలక పాత్రలో నటించడం విశేషం. హైదరాబాద్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో చిత్ర నిర్మాత వివి వామనరావు మాట్లాడుతూ సినిమా సాంగ్స్, టీజర్స్ కు మంచి స్పందన వచ్చింది. సెన్సార్ వారు ఈ సినిమాకు ఎ సర్టిఫికెట్ ఇచ్చారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా ఈ నెల 17న విడుదల చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నాం అని అన్నారు. చిత్ర దర్శకుడు పి.సునీల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ ఇందులో నటీనటులందరూ చాలా చక్కగా నటించారు. లక్ష్మీ పిక్చర్స్ అధినేత బి. బాపిరాజు ఈసినిమా తనే ప్రమోట్ చేసి విడుదల చేస్తుండడం చాలా సంతోషాన్ని కలిగించింది అని తెలిపారు.













