F1 The Movie: హాలీవుడ్ మూవీ రేర్ రికార్డు

ఓటీటీల డిమాండ్ పెరగడంతో ప్రతీ సినిమా రిలీజైన తక్కువ రోజులకే ఓటీటీలోకి వచ్చేస్తుంది. కొన్ని సినిమాలు ముందే ఓటీటీ డీల్ ను సెట్ చేసుకుంటే మరికొన్ని సినిమాలు మాత్రం రిలీజయ్యాక వచ్చే టాక్ ను బట్టి ఆ డీల్ ను అడ్జస్ట్ చేసుకుంటూ ఉంటాయి. ఏదేమైనా ఒకప్పటిలా సినిమాలకు థియేటర్లలో లాంగ్ రన్ ఉండటం లేదు. అప్పట్లో సినిమా హిట్ అయితే ఆ మూవీ నెలలు, ఏళ్ల పాటూ థియేటర్లలో ఉండేది.
కానీ ఇప్పుడు సిట్యుయేషన్స్ మారాయి. ఎంత బ్లాక్ బస్టర్ సినిమా అయినా రెండు లేదా మూడు వారాలకు మించి ఎక్కువగా ఆడటం లేదు. ఇలాంటి సిట్యుయేషన్స్ లో ఓ మూవీ 100 రోజుల థియేట్రికల్ రన్ ను అందుకుని అందరినీ ఆశ్చర్యపరిచింది. అదే ఎఫ్1(F1 The movie) మూవీ. బ్రాడ్ పిట్(Brad Pit) నటించిన ఈ ఇంగ్లీష్ సినిమాకు ఆడియన్స్ నుంచి సూపర్ రెస్పాన్స్ వచ్చింది.
ఎఫ్1 మూవీ థియేటర్లలో చూసిన ఆడియన్స్ కు ఆ సినిమా చాలా మంచి అనుభూతిని కలిగించింది. బాక్సాఫీస్ వద్ద వారం రోజులు సినిమా ఆడటమే కష్టమైన ఈ రోజుల్లో ఎఫ్1 సినిమా ఏకంగా 100 రోజులు ఆడటం విశేషం. ఇప్పటికీ దేశంలోని కొన్ని ఏరియాల్లోని థియేటర్లలో ఎఫ్1 మూవీ ఆడుతుందంటే ఈ సినిమాకు ఉన్న ఆదరణ అర్థం చేసుకోవచ్చు.